Rashmika Mandanna: గర్ల్‌ఫ్రెండ్‌గా రాబోతున్న రష్మిక.. కొత్త చిత్రం ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్..!

ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ వీడియోను తాజాగా విడుదల చేశారు. ఈ వీడియోలో రష్మిక నీటిలో మునిగి ఉంది. ఇది లవ్ స్టోరీగానే కాకుండా.. థ్రిల్లర్ మూవీగా కూడా ఉండొచ్చని వీడియో చూస్తే అర్థమవుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 22, 2023 | 07:14 PMLast Updated on: Oct 22, 2023 | 7:14 PM

Rashmika Mandannas Next Movie Titled The Girlfriend First Look Video Out

Rashmika Mandanna: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ఒకవైపు స్టార్ హీరోల సినిమాల్లో చేస్తూనే.. మరోవైపు ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటిస్తోంది. ఇప్పటికే ఒక ఫిమేల్ లీడ్ సెంట్రిక్ మూవీ చేస్తున్న రష్మిక తాజాగా మరో సినిమా కూడా కమిటైంది. ది గర్ల్‌ఫ్రెండ్‌ పేరుతో రష్మిక ప్రధాన పాత్రలో కొత్త సినిమా రూపొందనుంది. ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. మన్మధుడు-2 తర్వాత రాహుల్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇదే.

ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తుండటం విశేషం. మాస్ మూవీ మేకర్స్ సంస్థ, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు నిర్మాణ భాగస్వాములుగా ఉంటాయి. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ వీడియోను తాజాగా విడుదల చేశారు. ఈ వీడియోలో రష్మిక నీటిలో మునిగి ఉంది. ఇది లవ్ స్టోరీగానే కాకుండా.. థ్రిల్లర్ మూవీగా కూడా ఉండొచ్చని వీడియో చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఖుషి చిత్రానికి సంగీతం అందించింది అతడే. తెలుగులో వరుస సినిమాలతో సక్సెస్‌ఫుల్‌ మ్యూజిక్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్నాడు. చిత్ర రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలకానుంది.

ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాలి. రాహుల్ రవీంద్రన్ అటు నటుడిగా కొనసాగుతూనే.. ఇటు దర్శకత్వం చేస్తున్నాడు. ఆయన చివరిగా తెరకెక్కించిన మన్మధుడు 2 పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీంతో చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమా రూపొందిస్తున్నాడు.