Rashmika Mandanna: పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో రష్మిక.. కానీ..!
శ్రీలీల, మీనాక్షి చౌదరి, మృణాల్ ఠాకూర్ పోటీ అనుకున్నారు. రష్మిక ఆఫర్స్ వాళ్లే ఎగరేసుకుపోతున్నారు అనుకున్నారు. కానీ, నిజం అది కాదని తెలుస్తోంది. రష్మిక దేశ ముదురు కాదు.. ప్రపంచ ముదురు కాబట్టే ఏ సినిమాను పట్టుకోవాలో, ఏది వదిలిపెట్టాలో తెలిసున్న లేడీ అనే మాటే వినిపిస్తోంది.

Rashmika Mandanna: రష్మిక మందన్న నిజంగా నితిన్ మూవీ నుంచి బయటికి రావాల్సి వచ్చిందా..? స్వార్ధం కోసం కావాలనే తనే ఇలా చేస్తోందా..? మొన్నటి వరకు పూజా హెగ్డేలాగే రష్మికకు కూడా శ్రీలీల, మీనాక్షి చౌదరి, మృణాల్ ఠాకూర్ పోటీ అనుకున్నారు. రష్మిక ఆఫర్స్ వాళ్లే ఎగరేసుకుపోతున్నారు అనుకున్నారు. కానీ, నిజం అది కాదని తెలుస్తోంది. రష్మిక దేశ ముదురు కాదు.. ప్రపంచ ముదురు కాబట్టే ఏ సినిమాను పట్టుకోవాలో, ఏది వదిలిపెట్టాలో తెలిసున్న లేడీ అనే మాటే వినిపిస్తోంది.
నితిన్ మూవీని వదులుకోవటానికి కారణం రష్మికకు షాహిద్ కపూర్ మూవీ ఆఫర్ రావటమే. అంతేకాదు ఒక వైపు ఫుష్ప 2, మరో వైపు యానిమల్, ఇంకో వైపు షాహిద్ కపూర్ మూవీ.. అలానే ధనుష్‌తో శేఖర్ కమ్ముల తెలుగు, తమిళ్, హిందీలో తీసే ట్రైలింగువల్ మూవీతో బిజీ అవ్వనుంది రష్మిక. మొత్తానికి తను కేవలం పాన్ ఇండియా హీరోయిన్ అనిపించుకునేందుకే, ఆరాటపడుతోంది. పలితంగానే నితిన్ లోకల్ మూవీని పక్కన పెట్టినట్టుంది.