రష్మిక-విజయ్ పెళ్లి అక్కడే, డెస్టినేషన్ వెడ్డింగ్ లొకేషన్ అదేనా…?
టాలీవుడ్ లో స్టార్ హీరోలు హీరోయిన్లు ఇప్పుడు పెళ్లిళ్లతో బిజీబిజీగా గడుపుతున్నారు. రీసెంట్ గా కీర్తి సురేష్ సైలెంట్ గా పెళ్లి చేసుకుంది. గోవాలో తన ప్రియుడు ఆంటోనితో ఆమె వివాహం అత్యంత ఘనంగా జరిగింది. అతి తక్కువ మంది అతిధులతో ఈ వివాహ వేడుకలు నిర్వహించారు.
టాలీవుడ్ లో స్టార్ హీరోలు హీరోయిన్లు ఇప్పుడు పెళ్లిళ్లతో బిజీబిజీగా గడుపుతున్నారు. రీసెంట్ గా కీర్తి సురేష్ సైలెంట్ గా పెళ్లి చేసుకుంది. గోవాలో తన ప్రియుడు ఆంటోనితో ఆమె వివాహం అత్యంత ఘనంగా జరిగింది. అతి తక్కువ మంది అతిధులతో ఈ వివాహ వేడుకలు నిర్వహించారు. హిందూ సాంప్రదాయంలో ఈ వివాహ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో మరో పెళ్లికి రంగం సిద్ధమవుతోంది. దాదాపు 5, 6 ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్న రష్మిక మందన, విజయ్ దేవరకొండ ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నారు.
త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రానంది. ఇన్నాళ్ళు తమ రిలేషన్షిప్ ఎక్కడా బయటికి రాకుండా జాగ్రత్త పడినా మీడియా మాత్రం వాళ్ళిద్దరి విషయంలో కాస్త ఎక్కువగానే అటెన్షన్ ప్రదర్శించింది. ఇక వాళ్ళిద్దరు కూడా తమ రిలేషన్ షిప్ గురించి పరోక్షంగా ఏదో ఒక అనౌన్స్మెంట్ చేస్తూనే ఉన్నారు. తనకు 35 ఏళ్ల వచ్చాయని తాను ఇప్పుడు సింగిల్ గా ఎలా ఉంటా అంటూ విజయ్ దేవరకొండ చెప్తే… తాను ఎవరితో ప్రేమలో ఉన్నానో అందరికీ తెలుసు అంటూ రష్మిక కూడా కామెంట్ చేసింది.
దీనితో అప్పటివరకు డౌట్ ఉన్న వాళ్లకు కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక వీళ్లిద్దరూ ఇప్పుడు తమ ఇళ్లల్లో జరిగే కార్యక్రమాలకు కూడా హాజరవుతున్నారు. రీసెంట్ గా పుష్ప 2 సినిమాకు విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో కలిసి రష్మిక వెళ్ళింది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ అలాగే విజయ్ దేవరకొండ తల్లితో కలిసి ఆమె సినిమా చూసింది. దీనితో వీళ్ళు కచ్చితంగా పెళ్లి చేసుకుంటారని ప్రచారం మొదలైంది. అయితే వచ్చే ఏడాది మార్చి తర్వాత వీరి వివాహం జరిగే అవకాశం ఉంది.
ఆ సమయానికి రష్మిక తన చేతిలో ఉన్న సినిమాలన్నీ కంప్లీట్ చేసి ఫ్రీ అవుతుంది. విజయ్ దేవరకొండ చేతిలో ఉన్న సినిమా కూడా ఫినిష్ చేసి… ఫిబ్రవరి నాటికి ఫ్రీ అయ్యే ఛాన్స్ ఉంది. దీనితో అప్పుడు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారని టాక్. అయితే ఈ పెళ్లి కచ్చితంగా డెస్టినేషన్ వెడ్డింగ్ అని టాక్ కూడా టాలీవుడ్ లో వినపడుతోంది యూరోప్ లో పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉందని లేదంటే ఉదయపూర్ లో పెళ్లి చేసుకోవచ్చని కూడా అంటున్నారు. అయితే విజయ్ దేవరకొండకు నార్త్ ఇండియాలో ఒక ప్లేస్ బాగా నచ్చిందని అక్కడ పెళ్లి చేసుకోవడానికి రెడీ చేయడానికి ప్రచారం కూడా ఉంది.
అయితే వీళ్ళిద్దరూ ఎక్కువగా మాల్దీవ్స్ వెళుతూ ఉంటారు. దీనితో అక్కడ కూడా పెళ్లికి ఛాన్స్ ఉందనే ప్రచారం ఉంది. ఇక ఈ పెళ్లికి ఎక్కువ మంది అతిధులను పిలవకుండా చాలా తక్కువ మందిని పిలవడానికి ఇద్దరు రెడీ అవుతున్నారు. పాన్ ఇండియా సినిమాలతో ఇప్పుడు రష్మిక చాలా బిజీగా గడుపుతుంది. దాదాపు ఏడాది నుంచి ఆమె సినిమాలన్నీ కూడా సూపర్ హిట్లవుతున్నాయి. దీనితో రష్మిక క్రేజ్ కూడా భారీగా పెరిగింది. ఈ టైంలో పెళ్లి చేసుకుని సినిమాలు చేస్తుందా లేకపోతే మరేదైనా సెన్సేషనల్ అనౌన్స్మెంట్ ఉంటుందా అనేది చూడాలి.