Bigg Boss 7  : బిగ్‌బాస్ 7 రైతు బిడ్డ జర్నీలో రతిక లవ్ ట్రాక్.. హిస్టరీ క్రియేట్ చేస్తా అంటున్న యావర్

బిగ్‌బాస్ 7 ఫైనల్ వీక్ ఎమోషనల్‌గా రన్ అవుతోంది.. నామినేషన్స్, ఫైట్స్, గేమ్స్, టాస్కులు లేకుండా.. హౌస్‌ జర్నీలోని బ్యూటిఫుల్ మెమొరీస్‌ను చూపిస్తూ.. కంటెస్టంట్లను, ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తున్నారు బిగ్‌బాస్.. నిన్నటి ఎపిసోడ్‌లో యావర్, ప్రశాంత్ జర్నీ వీడియోస్‌ చూపించారు.. మొదటి యావర్ కి సంబంధించిన జర్నీ వీడియోని చూపించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 14, 2023 | 09:43 AMLast Updated on: Dec 14, 2023 | 9:43 AM

Rathikas Love Track In Bigg Boss 7 Rythu Biddah Journey

బిగ్‌బాస్ 7 ఫైనల్ వీక్ ఎమోషనల్‌గా రన్ అవుతోంది.. నామినేషన్స్, ఫైట్స్, గేమ్స్, టాస్కులు లేకుండా.. హౌస్‌ జర్నీలోని బ్యూటిఫుల్ మెమొరీస్‌ను చూపిస్తూ.. కంటెస్టంట్లను, ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తున్నారు బిగ్‌బాస్.. నిన్నటి ఎపిసోడ్‌లో యావర్, ప్రశాంత్ జర్నీ వీడియోస్‌ చూపించారు.. మొదటి యావర్ కి సంబంధించిన జర్నీ వీడియోని చూపించారు. బిగ్‌ బాస్ తన కోసం వేసిన AV చూసి యావర్ ఫుల్ ఎమోషనల్ అయ్యాడు. తాను అందరి వాడినంటూ చెప్పుకొచ్చాడు.. బిగ్ బాస్ జర్నీ తనను ఎంతగానో మార్చిందని.. ఈ సీజన్‌లో కప్పు కొట్టి డెఫినెట్‌గా హిస్టరీ క్రియేట్ చేస్తానంటూ ధీమా వ్యక్తం చేశాడు.

తన జర్నీని చూసేందుకు ఉత్సాహంగా మెడలో ఎర్ర కండువా వేసుకొని గార్డెన్ ఏరియాకి వచ్చాడు ప్రశాంత్.. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ జర్నీని కూడా ఎంతో బ్యూటిఫు్‌గా చూపించాడు బిగ్‌బాస్.. కామన్ మ్యాన్ గా రైతు బిడ్డ అనే ట్యాగ్ తో బిగ్‌బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి పుష్పలా ఎదిగాడని చెప్పుకొచ్చాడు బిగ్‌బాస్.. బిగ్‌బాస్ AV చూసిన ప్రశాంత్ ఎమోషనల్ అయ్యాడు.. అయితే ప్రశాంత్ రతిక రోజ్‌తో నడిపిన లవ్ ట్రాక్‌ను కూడా బాగా కవర్ చేశారు బిగ్‌బాస్‌.. నిజానికి ప్రశాంత్‌ కాకుండా ఆ వీడియోలో ఎక్కువగా కనిపించింది రతికనే.. ఇక రతిక పొడిచిన వెన్నుపోటు నుంచి తేరుకొని ఫైనలిస్ట్‌గా ప్రశాంత్ ఎలా నిలబడ్డాడో అద్భుతంగా చూపించాడు బిగ్‌బాస్.. ఈ వీడియోతో ఎంతో ఎమోషనల్ అయిన రైతు బిడ్డ.. రైతు గర్వపడేలా చేస్తాను అంటూ మాటిచ్చాడు. తన బాపూతో ఉన్న ఫొటో చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు.
నిన్నటితో.. నిన్నటితో ఫైనలిస్టుల జర్నీకి సంబంధించిన ఎపిసోడ్స్ పూర్తి అయ్యాయి. ఇక.. ఇప్పుడు ఈ సీజన్ లో ఎవరు కప్పు కొడతారా అని అంతా ఎదురు చూస్తున్నారు. మరో వైపు బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ ఎపిసోడ్ గెస్ట్ ఎవరన్నది ఆడియన్స్ కు ఎగ్జైట్మెంట్ కలిగిస్తోంది.. సండే ఫైనల్ ఎపిసోడ్ ని బిగ్ బాస్ టీం గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫైనల్ ఎపిసోడ్ కి సూపర్ స్టార్ మహేష్ ని ఆహ్వానిస్తున్నారంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. విజేతకి మహేష్ చేతుల మీదుగా టైటిల్ అందచేస్తారని తెలుస్తోంది.. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ కి ఎప్పటిలానే 50 లక్షల ప్రైజ్ మనీ ప్రకటించగా దానితో పాటుగా 15 లక్షల విలువ గల గోల్డ్ ఆర్నమెంట్స్ ఇంకా బ్రీజా కారుని కూడా గిఫ్ట్ గా ఇస్తున్నారు. బిగ్ బాస్ 7 ఫైనల్స్ కి మహేష్ వస్తున్నారని తెలియగానే బిగ్ బాస్ ఆడియన్స్ కి జోష్ మరింత పెరిగింది.