Ravanasura Movie Review: రావణాసుర మెప్పించాడా? మూవీ హిట్టా.. ఫట్టా? ఫుల్ మూవీ రివ్యూ!
మొత్తానికి రవితేజ హ్యాట్రిక్ హిట్ కొట్టేశాడబ్బా. రావణాసుర సినిమా ఫస్ట్‌డే.. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బ్లాక్‌బస్టర్ కాకపోయినా సినిమా చాలా బాగుందని చెప్తున్నారు ఆడియన్స్. సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయొచ్చని చెప్తున్నారు.
Ravanasura Movie Review: రవితేజ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ రావణాసుర. అను ఇమ్మానుయేల్, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ, ఫరియా అబ్దుల్లా, దక్ష నాగర్కర్ హీరోయిన్లుగా నటించారు. అక్కినేని సుశాంత్ కీలక పాత్రలో కనిపించాడు. సుధీర్ వర్మ దర్శకుడు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రాన్ని అభిషేక్ నామా, రవితేజ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే ధమాకా, వాల్తేర్ వీరయ్య చిత్రాలు సక్సెస్‌తో ఊపుమీదున్న రవితేజకి ఈ చిత్రం హ్యాట్రిక్ అందించిందా? ఇంతకీ ఈ చిత్రం ఎలా ఉందంటే..
సినిమా కథేంటి..
ఇక సినిమా కథ విషయానికి వస్తే.. ఫరియా అబ్ధుల్లా దగ్గర రవితేజ జూనియర్ లాయర్‌గా పని చేస్తుంటాడు. మరో హీరోయిన్ మేఘా ఆకాష్ వాళ్ల నాన్నని మర్డర్ కేసులో పోలీసులు అరెస్ట్ చేస్తారు. వాళ్ల నాన్న కేస్ వాదించాలంటూ మేఘా ఆకాష్ రవితేజ, ఫరియా దగ్గరికి వస్తుంది. ఆ కేసును టేకప్ చేసి స్టడీ చేస్తుంటుంది ఫరియా. కానీ కొన్ని రోజులకు అలాంటివే ఇంకొన్ని మర్డర్స్ కూడా జరుగుతాయి. ఇలా మర్డర్స్ చేస్తున్న సీరియల్ కిల్లర్ ఎవరో కాదు. హీరో రవితేజ. హీరో ఎందుకు ఇలా మర్డర్స్ చేస్తున్నాడు ? లాయర్‌గా పని చేస్తున్న వ్యక్తి ఇలా మర్డర్స్ చేయాల్సిన అవసరం ఏంటి ? అసలు వాళ్లతో హీరోకు శతృత్వం ఏంటి ? ఎంతో జోయల్‌గా ఉండే పర్సన్ ఇంత వైలెంట్‌గా ఎందుకు మారాడు ? చివరికి పోలీసులకు చిక్కాడా.. లేదా? అన్నదే మిగతా స్టోరీ. కథను ప్రజెంట్ చేయడంతో డైరెక్టర్ సుధీర్ వర్మ సక్సెస్ అయ్యాడు.
ఎంటర్‌టైన్‌మెంట్ విత్ ట్విస్ట్స్
సినిమా ఫస్ట్ హాఫ్ మంచి ఎంటర్టైనింగ్‌గా కంటిన్యూ చేశాడు దర్శకుడు సుధీర్ వర్మ. ఆడియన్స్ అంతా మంచి ఫన్ మూడ్‌లో ఉండగా సినిమాలోని ట్విస్ట్‌ను రివీల్ చేసి వాళ్లను థ్రిల్ చేశాడు. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ సీన్స్ ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేశాయి. అప్పటి వరకూ మంచి ఎటర్టైనర్‌గా అనిపించిన.. కథ ఒక్కసారిగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాగా మారిపోతుంది. తరువాత ఏం జరగబోతోంది అనే ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇక నెగటివ్ షేడ్‌లో రవితేజ పెర్ఫార్మెన్స్ ఇరగదీశాడు. రెండు షేడ్స్‌కు సంబంధం లేకుండా ఫర్ఫెక్ట్‌గా వేరియన్స్ చూపించాడు. హీరోయిన్స్ ఫరియా అబ్దుల్లా, దక్ష నాగర్కర్, అను ఇమ్మానుయేల్, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ.. తమ రోల్స్‌కు న్యాయం చేశారు.
చాలా కాలం తరువాత హీరో సుశాంత్‌కు ఒక మంచి రోల్ దొరికింది. ఈ సినిమాలో సుశాంత్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపించాడు. సంపత్ రాజ్, జయరాం లాంటి సీనియర్ యాక్టర్స్ క్యారెక్టర్‌లో జీవించేశారు. మెయిన్‌గా జయరాం, రవితేజ మధ్య జరిగే దొంగ పోలీస్ చేజింగ్ సినిమాలో మంచి ఇంటెన్సిటీ క్రియేట్ చేసింది. అయితే ఫస్ట్ హాప్‌లో మాత్రం కొన్ని సీన్స్ ల్యాగ్ అయ్యాయి. రెండు సాంగ్స్ సందర్భం లేకుండా వచ్చాయి. దీనికి తోడు ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ A సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ ఎఫెక్ట్ బాక్సాఫీస్ దగ్గర పడే చాన్స్ ఉంది. ఈ రెండు మినహా సుధీర్ వర్మ తన మార్క్ ఎంటర్టైన్‌మెంట్‌తో పాటు మంచి థ్రిల్లింగ్ స్టోరీని ఒకే సినిమాలో ఆడియన్స్‌కు అందించాడు. సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయొచ్చని చెప్తున్నారు.
హ్యాట్రిక్ కొట్టాడా?
మొత్తానికి రవితేజ హ్యాట్రిక్ హిట్ కొట్టేశాడబ్బా. రావణాసుర సినిమా ఫస్ట్‌డే.. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బ్లాక్‌బస్టర్ కాకపోయినా సినిమా చాలా బాగుందని చెప్తున్నారు ఆడియన్స్. ధమాకా, వాల్తేరు వీరయ్యతో వరుస హిట్స్ అందుకున్న రవితేజ మరో హిట్ కొట్టడంతో ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీలో ఉన్నారు. కెరీర్‌లో చాలా కాలం తరువాత హ్యాట్రిక్ హిట్స్ కొట్టాడు రవితేజ. దీంతో థియేటర్స్ దగ్గర రవితేజ ఫ్యాన్స్ చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఇప్పటికే మంచి సక్సెస్ మీదున్న రవితేజకు ఈ చిత్రం కూడా మరో విజయాన్ని అందించబోతుంది.