Yash : రావణ్‌గా యష్‌

KGF హీరో యష్ గురించి అందరికీ తెలిసిందే. KGF సిరీస్‌తో పాన్ ఇండియా హీరోగా మారిన యష్.. ప్రస్తుతం టాక్సిక్ అనే సినిమా చేస్తున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 12, 2024 | 10:00 AMLast Updated on: Apr 12, 2024 | 10:00 AM

Ravans Role In Kgf Pan India Star Hero Yash Ramayanam Movie

KGF హీరో యష్ గురించి అందరికీ తెలిసిందే. KGF సిరీస్‌తో పాన్ ఇండియా హీరోగా మారిన యష్.. ప్రస్తుతం టాక్సిక్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే.. బాలీవుడ్ (Bollywood) రామాయణం (Ramayanam) లో రావణుడిగా నటిస్తున్నాడని వార్తలు రాగా.. ఇప్పుడు ఓ బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్‌ మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్‌ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. వచ్చే ఏడాదిలో టాక్సిక్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఈ సినిమా తర్వాత యష్ (Yash) ప్రాజెక్ట్ గురించి ఎలాంటి క్లారిటీ లేదు. కానీ బాలీవుడ్‌లో తెరకెక్కబోతున్న భారీ ప్రాజెక్ట్ రామాయణంలో రావణుడిగా నటించనున్నట్టుగా చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. దంగల్ దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణం’లో.. రాముడిగా రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. రావణుడి పాత్రలో యష్ నటించే ఛాన్స్ ఉందని అన్నారు.

కానీ ఇప్పుడు మరో న్యూస్ తెరపైకి వచ్చింది. యష్ రావణ్‌గా నటిస్తున్నాడా? లేదా? అనే విషయంలో క్లారిటీ రాకుండనే.. ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో యష్ నటించకపోయినా కూడా.. సహ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌లో యష్ దాదాపు 100 కోట్ల పెట్టుబడి పెడుతున్నారట. ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. యష్ కూడా నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నాడనే చెప్పాలి. కానీ రావణ్‌గా యష్ నటిస్తే మాత్రం.. ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోవడం గ్యారెంటీ. త్వరలోనే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రానుంది.