Tiger Nageswara Rao: టైగర్ నాగేశ్వర రావు.. ఆ హీరోలు వదిలేస్తే రవితేజ చేశారా..?
టైగర్ ప్రమోషన్‌లో మాట్లాడుతూ.. అనివార్య కారణాల వల్ల బెల్లంకొండతో సినిమా మొదలు కాలేదన్నారు. రవితేజతో టైగర్ నాగేశ్వరరావును అనౌన్స్ చేసిన తర్వాత శ్రీనివాస్ మరో దర్శకుడితో 'స్టూవర్ట్ పురం దొంగ' ప్రకటించారని.. ఆ ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయిందో తెలీదన్నాడు వంశీ.

Tiger Nageswara Rao: 20న రిలీజ్ అవుతున్న టైగర్ నాగేశ్వరావు చాలామంది హీరోల చుట్టూ తిరిగి చివరికి మాస్‌రాజా దగ్గరకు చేరింది. రవితేజ టైగర్ నాగేశ్వర రావుతో ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఓ పెద్ద హీరో.. ఓ చిన్న హీరో దగ్గరకు వెళ్లిన టైగర్ నాగేశ్వరరావు రవితేజ దగ్గరకు ఎలా వచ్చింది..? టైగర్ నాగేశ్వరరావు డైరెక్ట్ చేసిన వంశీ ఈ కథను ముందుగా చిరంజీవికే వినిపించాడు. మెగాస్టార్ కాదంటే టైగర్ నాగేశ్వరరావు రవితేజ దగ్గరకొచ్చింది. ఈ కథను రిజెక్ట్ చేసిన చిరంజీవి టైగర్ నాగేశ్వరరావు ఓపెనింగ్‌కు వచ్చి రవితేజపై క్లాప్ ఇవ్వడం విశేషం.
ఎందుకు రిజెక్ట్ చేయాల్సి వచ్చిందో చిరంజీవి చెప్పకపోయినా.. అన్నయ్య నుంచి తమ్ముడి చేతికి టైగర్ వచ్చాడు. టైగర్ స్టోరీని ముందుగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు చెప్పినట్లు వంశీ తెలిపాడు. టైగర్ ప్రమోషన్‌లో మాట్లాడుతూ.. అనివార్య కారణాల వల్ల బెల్లంకొండతో సినిమా మొదలు కాలేదన్నారు. రవితేజతో టైగర్ నాగేశ్వరరావును అనౌన్స్ చేసిన తర్వాత శ్రీనివాస్ మరో దర్శకుడితో ‘స్టూవర్ట్ పురం దొంగ’ ప్రకటించారని.. ఆ ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయిందో తెలీదన్నాడు వంశీ.
ఇలా మెగాస్టార్ చిరంజీవి.. యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ను దాటుకుని.. చివరికి మాస్‌రాజా చేతిలో పడింది. పాన్ ఇండియా మూవీ కావడంతో.. ముంబైలో ట్రైలర్ రిలీజ్ చేశారు. రెండోసారి ముంబైయ్ వెళ్లిన రవితేజ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. త్వరలో చెన్నయ్.. బెంగుళూరు.. త్రివేండ్రం వెళ్లి తమిళం, కన్నడ, మలయాళంలో కూడా భారీగా ప్రమోట్ చేయనున్నాడు రవితేజ. మాస్‌రాజా తన కెరీర్‌లో ఇన్ని రోజులు ప్రమోషన్ ఎప్పుడూ చేయలేదు.