RAVI TEJA: మాసోడి ఎంట్రీ.. హనుమాన్‌లో రవితేజ

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో తేజ ఈ మూవీతో మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో ఈ మూవీపై ఆడియన్స్‌లో భారీ హైప్ క్రియేట్ అయింది. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 27, 2023 | 04:21 PMLast Updated on: Dec 27, 2023 | 4:21 PM

Ravi Teja Lend His Voice To Hanuman Movie

RAVI TEJA: మాస్‌ మహరాజా రవితేజ ఫ్యాన్స్‌కు మాంచి కిక్‌ ఇచ్చే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. పాన్ ఇండియా మూవీ హనుమాన్‌లో ఆయన కూడా ఓ పార్ట్ కాబోతున్నారు. ఈ సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్ పాత్రకు ఆయన వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఇంతకీ రవితేజ వాయిస్ ఓవర్ ఇస్తున్న పాత్ర ఏమిటో తెలుసుకోవాలనుందా..? తేజ సజ్జా హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

CM Revanth Reddy  : హరీష్‌, కేటీఆర్‌ ప్రజల రక్తపు కూడు తిన్నారు.

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో తేజ ఈ మూవీతో మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో ఈ మూవీపై ఆడియన్స్‌లో భారీ హైప్ క్రియేట్ అయింది. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేసింది. రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ప్రేక్షకులకు ఓ సర్ప్రైజింగ్ అప్డేట్ అందించారు. ఈ సినిమాలో మాస్ మహరాజా రవితేజ కూడా భాగమవుతున్న విషయాన్ని మేకర్స్ రివీల్ చేశారు. అంటే ఈ సినిమాలో రవితేజ కనిపించరు. కానీ.. వినిపించబోతున్నారు. అదేనండీ.. ఈ సినిమాలోని ఓ కోతి పాత్రకు రవితేజ తన వాయిస్‌ అరువు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. హనుమాన్ సినిమాలో కోటి అనే వాన‌రం పాత్ర ఒక‌టి ఉంది. సినిమా అంత‌టా ఈ కోతి పాత్ర ట్రావెల్ అవుతూనే ఉంటుంది. ఈ కోతి పాత్రకు ఎంతో ప్రాముఖ్యం కూడా ఉందట. ఆ పాత్రకే రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇక.. రవితేజ కామెడీ టైమింగ్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అందుకే.. కోతి పాత్రకు, ర‌వితేజ గొంతులోని చ‌మ‌త్కారం కలిసి ప్రేక్షకుల్ని ఆక‌ట్టుకొంటాయ‌ని చిత్రబృందం న‌మ్మకంగా చెబుతోంది. ఇది వ‌ర‌కు ‘మ‌ర్యాద రామ‌న్న’లో సైకిల్ పాత్ర‌కు ర‌వితేజ డ‌బ్బింగ్ చెప్పారు. ర‌వితేజ చ‌మ‌త్కారంతో సైకిల్ నుంచి కూడా ఫ‌న్ పండింది. ఇప్పుడు కోతి పాత్రతో రవితేజ ఇంకెంత వినోదం సృష్టిస్తారో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రవితేజ వాయస్ ఓవర్‌ సెంటిమెంట్‌ ఈ సినిమాకు ఎంత వరకు ప్లస్ అవుతుందో అని ఇప్పటి నుంచే లెక్కలు వేస్తున్నారు. జ‌న‌వ‌రి 12న ‘హ‌నుమాన్‌’ విడుద‌ల అవుతుండగా ఇదే సీజ‌న్‌లో ర‌వితేజ ‘ఈగ‌ల్‌’ కూడా విడుద‌ల‌కు సిద్ధమైంది.