హిట్, ఫట్ జాన్తా నై.. డబ్బులు వెనకేసుకోవడమే టార్గెట్‌..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 15, 2024 | 04:30 PMLast Updated on: Aug 15, 2024 | 4:30 PM

Ravi Teja Line Up Of Movies

రవితేజ సినిమా అంటే మినిమం గ్యారంటీ అనే పేరు ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు గ్యారంటీ కాదు కదా ఆ ఆశలకు వారంటీ కూడా లేకుండా పోతోంది. ఇండస్ట్రీలో ఏడాదికి మూడు సినిమాలు చేస్తున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే.. అది రవితేజ మాత్రమే! సినిమా హిట్టా.. ఫట్టా అన్న ఆలోచన లేకుండా.. మాస్‌ మహారాజా వరుసపెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నాడు. కొన్ని తన స్థాయిని మించిన కథల్లా ఉంటే.. మరికొన్ని మాత్రం అసలు తనవి కాని స్థాయి కథలు చేస్తూ.. ఫ్యాన్స్‌ను ఇబ్బంది పెడుతున్నాడు రవితేజ. లేటెస్ట్ రిలీజ్‌ మిస్టర్‌ బచ్చన్‌ కూడా.. తేడా కొట్టేసింది. థియేటర్‌ నుంచి ప్రేక్షకులు అంతా నీరసంగా బయటకు వచ్చేస్తున్నారు. డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ దొరికాడో అంతే సంగతి అనేలా ఉన్నాయ్ వాళ్ల వార్నింగ్స్. ఐతే రవితేజ సినిమాల దండయాత్ర చూస్తుంటే.. దీపం ఉన్నప్పుడే ఇల్లు సర్దుకోవాలి అనుకుంటున్నాడా అనిపిస్తోంది. ఆల్రెడీ మాస్‌ మహారాజా 60 ప్లస్‌కు వచ్చేశాడు. గట్టిగా లెక్కేస్తే ఇంకొన్ని ఏళ్లు మాత్రమే కెరీర్ ఉంటుంది. ఈలోపే హీరోగా అందినకాడికి అవకాశాలు దక్కించుకొని.. సినిమాలు చేసేసి.. డబ్బులు సంపాదించుకోవాలి అని రవితేజ ఫిక్స్ అయ్యాడా అనిపిస్తోంది. అందుకే హిట్లు, ఫట్లతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. దీపం ఆరిపోయే లోపు ఇల్లు సర్దుకోవాలి.. చాన్స్‌లు అయిపోయో లేపు సంపాదించుకోవాలన్నది రవితేజ ఆలోచనగా కనిపిస్తోంది. ప్రస్తుతం రవితేజ పూర్తిగా ఇదే మూడ్‌లోకి వెళ్లిపోయాడా అంటే.. వరుస పెట్టి వస్తున్న సినిమాలు అదే నిజం అనిపిస్తున్నాయ్. గత ఆరేళ్లుగా ధమాకా మినహా.. రవితేజకు ఒక్క హిట్‌ కూడా లేదు. అది కూడా ప్రమోషన్ల పుణ్యమా అని హిట్ అయింది తప్ప.. ఆ రేంజ్‌ బ్లాక్‌బస్టర్ సరుకు కాదు అది! ఈ ఇయర్ ఇప్పటికే రెండుసినిమాలు వచ్చేశాయ్. మరో రెండు సినిమాలు రిలీజ్‌కు రెడీ ఉన్నాయ్. ఇలా వరుస పెట్టి సినిమాలు చేయడం వెనక.. డెడికేషన్ అని రవి ఫ్యాన్స్‌ వెనకేసుకొచ్చి.. అసలు కారణం మాత్రం ఏజ్‌ ఫ్యాక్టరే అంటున్నారు మరికొందరు. రవితేజకు 60 ఏళ్లు వచ్చాయ్. ఏదో జ్యూసులతో బాడీ మెయింటైన్ చేస్తున్నాడు. యాక్టింగ్‌లో,.. ఎంచుకుంటున్న కథల్లో కొత్తదనం లేదు. కొత్తవాళ్లతో చేస్తున్నారు అంతే ! ఒకే శైలిలో నటిస్తూ.. ఏ మార్పులు లేకుండా రవితేజ నెట్టుకొచ్చేస్తున్నాడు. మిస్టర్‌ బచ్చన్‌.. ఇంతకుముందు ముందు వచ్చిన ఈగల్ సినిమా చూస్తే అదే అర్థం అయింది. ఎన్ని వీలైతే అన్ని సినిమాలు చేసి… చకచగా నాలుగు డబ్బులు సంపాదించుకోవాలనే యావలో రవితేజ ఉన్నాడా అనిపిస్తోంది.