RAVI TEJA: మాస్ మహారాజా రవితేజ కొంపముంచుతున్న రెమ్యునరేషన్..

రాజా దిగ్రేట్ లాంటి హిట్ తర్వాత అనిల్ రావిపుడి మేకింగ్‌లో రవితేజ సినిమా అంటే అంచనాల భారం పెరుగుతుంది. అలాంటి క్రేజీ ప్రాజెక్ట్‌ని దిల్ రాజు నిర్మించబోతుంటే.. రూ.40 కోట్ల పారితోషికం అడిగాడట మాస్ మహారాజా.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 12, 2023 | 05:28 PMLast Updated on: Dec 12, 2023 | 5:28 PM

Ravi Teja Taking Wrong Step With His Remuneration

RAVI TEJA: మాస్ మహారాజా రవితేజ డేంజర్ జోన్‌లోకి వెళుతున్నాడా..? తన నిర్ణయాలే తన కొంపముంచేలా ఉన్నాయా..? నిజంగా మొన్న గోపీచంద్ మలినేని మేకింగ్‌లో రవితేజ చేయాల్సిన సినిమా ఆగినప్పుడు ఎవరూ ఇలా అనుకోలేదు. కాని దిల్ రాజు బ్యానర్‌లో అనిల్ రావిపుడి తీయబోయే సినిమా ఆగేలా ఉండటంతో రవితేజ రాంగ్ రూట్లో వెళుతున్నాడా అంటున్నారు. రాజా దిగ్రేట్ లాంటి హిట్ తర్వాత అనిల్ రావిపుడి మేకింగ్‌లో రవితేజ సినిమా అంటే అంచనాల భారం పెరుగుతుంది.

Jr NTR: దేవర రాక ఆలస్యం.. వార్ 2 కి బ్రేక్..

అలాంటి క్రేజీ ప్రాజెక్ట్‌ని దిల్ రాజు నిర్మించబోతుంటే.. రూ.40 కోట్ల పారితోషికం అడిగాడట మాస్ మహారాజా. అంతే.. దిల్ రాజు షాక్ తిన్నాడని తెలుస్తోంది. మొన్నటికి మొన్న గోపీచంద్ మలినేని మేకింగ్‌లో రవితేజ చేయాల్సిన మూవీని మైత్రీ మూవీ మేకర్స్ వద్దనుకోవటానికి రవితేజ పారితోషికమే కారణమట. మొన్నటి వరకు తెలుగు సినిమా పాన్ ఇండియా మార్కెట్‌ని ఏలింది. హిందీ డబ్బింగ్ రైట్స్‌పాటు ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్ అంటూ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ వచ్చింది. కాబట్టి హీరోలు పారితోషికం పెంచినా నిర్మాతలు భరించారు. కానీ, ఇప్పుడు హిందీ డబ్బింగ్ రైట్స్ డిమాండ్ తగ్గింది. శాటిలైట్ చానల్స్ కూడా ఓటీటీ దెబ్బతో సినిమాల రైట్స్ కోసం ఎగబాకట్లేదు. ఓటీటీలు కూడా హిట్ అయిన మూవీలే కొంటున్నాయి. కాబట్టి ఈ అదనపు ఆదాయం పోవటంతో, నిర్మాతలు హీరోల పారితోషికాలు తగ్గించాలని కోరుతున్నారు.

హిట్లొచ్చినప్పుడు, మార్కెట్ పెరిగినప్పుడు రెమ్యునరేషన్ పెంచటం కామనే. కాని అదనపు ఆదాయం లేక, థియేట్రికల్ రైట్స్‌తోనే పెట్టుబడి రాబట్టాలంటే అదృష్టం కలిసి రావాలి. ఆ విషయంలో హరీష్ శంకర్‌తో రవితేజ చేయాల్సిన సినిమా డైలామాలో పడటానికి మాస్ మహారాజా రెమ్యునరేషనే కారణమట. చిరు కూడా ఈమధ్య దిల్ రాజుకి ఓ మూవీ విషయంలో రూ.70 కోట్ల రెమ్యునరేషన్ అడిగి షాక్ ఇచ్చాడు. అదే పని రవితేజ చేస్తుండటంతో దిల్ రాజే కాదు.. మిగతా ప్రొడ్యూసర్స్ కూడా ప్రాజెక్ట్‌లని పక్కన పెట్టేలా ఉన్నారంటున్నారు.