Bhagyashri Bose: మిస్ క్యాడ్బరీ.. మాస్ మహారాజ కోసం క్లాస్ మహారాణి

షాక్, మిరపకాయ్ సినిమాల తరువాత ముచ్చటగా మూడోసారి ఈ కాంబినేషన్‌లో సినిమా రాబోతుంది. వీరిద్దరూ ఇప్పుడు మిస్టర్ బచ్చన్ అంటూ మురిపించబోతున్నారు. ఇందులో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే అనే యాక్ట్రస్‌ను తీసుకున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 18, 2023 | 04:36 PMLast Updated on: Dec 18, 2023 | 4:36 PM

Ravi Teja To Star In Harish Shankars Mr Bachchan Alongside Heroine Bhagyashri Bose 2

Bhagyashri Bose: టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్లలో డైరెక్టర్ హరీష్ శంకర్ – మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్ ఒకటి. పంచ్ డైలాగులు పేలాలన్నా, కామెడీతో కితకితలు పెట్టాలన్నా, వీరిది వరల్డ్ ఫెమస్ జోడి. షాక్, మిరపకాయ్ సినిమాల తరువాత ముచ్చటగా మూడోసారి ఈ కాంబినేషన్‌లో సినిమా రాబోతుంది. వీరిద్దరూ ఇప్పుడు మిస్టర్ బచ్చన్ అంటూ మురిపించబోతున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేసారు.

SALAAR: జస్ట్ మిస్.. ‘సలార్‘లో వరద పాత్ర గోపీచంద్ చేసి ఉంటేనా..

ఇందులో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే అనే యాక్ట్రస్‌ను తీసుకున్నారు. దీంతో ఆమె గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే గురించి గూగులింగ్‌ చేస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన భాగ్యశ్రీ బోర్సే మోడల్‌గా ఫేమ్‌ సొంతం చేసుకున్నారు. పలు బ్రాండ్స్‌ కోసం ఆమె మోడల్‌గానూ వ్యవహరించారు. క్యాడ్‌బరీ డెయిరీ మిల్క్‌ సిల్క్‌ చాక్లెట్‌ యాడ్‌ ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది. ‘యారియన్‌ 2’ అనే బాలీవుడ్‌ చిత్రంతో భాగ్యశ్రీ నటిగా తెరంగేట్రం చేశారు. తెలుగుదనం ఉట్టిపడేలా ఉన్న ఈ మరాఠి ముద్దుగుమ్మ టాలీవుడ్‌లో పాగా వేసే విధంగా ఎంట్రీ దక్కిందని చెప్పుకోవాలి. మరోవైపు హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా నిర్మాణంలో ఉంది.

పవన్ పాలిటిక్స్‌లో బిజీగా ఉన్న నేపథ్యంలో హరీష్ శంకర్ రవితేజతో మూవీని ఫినిష్ చేసే పనిలో పడ్డాడు. రవితేజ బాడీ లాగ్వేజ్‌కి హరీష్ శంకర్ జోడించే డైలాగ్స్ కోసం మాస్ మహారాజ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూడడం స్టార్ట్ చేసారు.