Sankranti war : చిరంజీవికి పోటీగా రవితేజ, వెంకటేష్…
ఈ ఏడాది సంక్రాంతికి పలు సినిమాలు విడుదలయ్యాయి. 'గుంటూరు కారం', (Guntur Kaaram) 'హనుమాన్'(Hanuman), 'సైంధవ్', 'నా సామి రంగ' సినిమాలు పొంగల్ బరిలో దిగి ప్రేక్షకులను అలరించాయి.

Ravi Teja, Venkatesh to compete with Chiranjeevi...
ఈ ఏడాది సంక్రాంతికి పలు సినిమాలు విడుదలయ్యాయి. ‘గుంటూరు కారం’, (Guntur Kaaram) ‘హనుమాన్'(Hanuman), ‘సైంధవ్’, ‘నా సామి రంగ’ సినిమాలు పొంగల్ బరిలో దిగి ప్రేక్షకులను అలరించాయి. అయితే వచ్చే పొంగల్ పోరు అంతకుమించి అనేలా ఉండబోతుంది.
2025 సంక్రాంతి (2025 Sankranti) సీజన్ పై పలు సినిమాలు కర్చీఫ్ వేస్తున్నాయి. వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ (Vishwambhara) సినిమాని వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు సంక్రాంతి సీజన్ పై మరో రెండు సినిమాలు కర్చీఫ్ వేశాయి.
ఉగాది సందర్భంగా కొత్త సినిమాల ప్రకటనలు వచ్చాయి. రవితేజ తన 75వ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో చేస్తున్నాడు. భాను బోగవరపు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని 2025 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
అలాగే ‘ఎఫ్-2’, ‘ఎఫ్-3’ సినిమాల తర్వాత ముచ్చటగా మూడోసారి దర్శకుడు అనిల్ రావిపూడితో వెంకటేష్ చేతులు కలిపాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ మూడు సినిమాలతో పాటు మరికొన్ని పెద్ద సినిమాలు కూడా పొంగల్ పోరుకి సిద్ధమయ్యేలా ఉన్నాయి.