Ravi Teja: బాలయ్య, రవితేజ మధ్య మరోసారి గ్యాప్..!
బాలకృష్ణ, రవితేజ మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటుందన్న విమర్శలకు అన్‌స్టాపబుల్ ప్రోగ్రామ్ ఫుల్‌స్టాప్ పెట్టింది. బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించగా.. ఓ ఎపిసోడ్‌కు మాస్‌రాజా రావడం.. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చూసి.. విబేధాలంతా ట్రాష్ అని రుజువైంది.

Ravi Teja: బాలకృష్ణ, రవితేజ మధ్య మరోసారి విబేధాలు వచ్చాయా..? బాలయ్య భగవంత్ కేసరి గురించి రవితేజ పాజిటివ్‌గా స్పందిస్తుంటే.. బాలకృష్ణ మాత్రం రవితేజను ఎందుకు పట్టించుకోవడం లేదు..? భగవంత్ కేసరి దర్శకుడు.. మ్యూజిక్ డైరెక్టర్‌ది ఒక దారైతే.. బాలయ్య మాత్రం ఎందుకు రివర్స్‌లో వెళ్తున్నాడు. బాలకృష్ణ, రవితేజ మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటుందన్న విమర్శలకు అన్‌స్టాపబుల్ ప్రోగ్రామ్ ఫుల్‌స్టాప్ పెట్టింది. బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించగా.. ఓ ఎపిసోడ్‌కు మాస్‌రాజా రావడం.. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చూసి.. విబేధాలంతా ట్రాష్ అని రుజువైంది.
గతంలో సంక్రాంతి రేసులో బాలకృష్ణ, రవితేజ రెండుసార్లు తలబడితే.. మాస్‌రాజానే విన్నర్ అయ్యాడు. అయితే ఈసారి ఈ ఇద్దరు దసరా రేసులో ఫైటింగ్‌కు దిగుతున్నారు. 19న భగవంత్ కేసరి.. 20న ‘టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ అవుతున్నాయి. రీసెంట్‌గా జరిగిన టైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రవితేజ మాట్లాడుతూ.. బాలయ్య బాబు భగవంత్ కేసరి హిట్ కావాలన్నాడు. భగవంత్ కేసరి ఈవెంట్ ఏది జరిగినా అనిల్ రావిపూడి, థమన్.. టైగర్ నాగేశ్వరరావు, విజయ్ లియో కూడా హిట్ కావాలన్నారు. లియో గురించి చెప్పిన థమన్ టైగర్ నాగేశ్వరరావును మర్చిపోవడంతో.. అనిల్ గుర్తు చేశాడు కూడా. టైగర్ నాగేశ్వరరావు సక్సెస్ అవ్వాలని అనిల్, థమన్ ఆకాంక్షించినా.. బాలయ్య మాత్రం దీనికి దూరంగా వున్నాడు. అంతేకాదు.. మాకు మేమే పోటీ.. టైగర్ పోటీకాదని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పాడు.
అందరూ టైగర్ హిట్ కావాలంటూ బెస్ట్ విషెస్ తెలియజేసినా.. బాలయ్య మాత్రం ఈ ఊసెత్తకపోవడం విశేషం. గతంలో రెండుసార్లు తన మీద గెలిచిన రవితేజకు బెస్ట్ విషెస్ చెప్పాలనిపించలేదా..? ప్రతిసారీ.. తనకు తానే పోటీ అనే బాలయ్య ఇదే డైలాగ్ రిపీట్ చేశాడా..?మున్ముందు జరిగే ఈవెంట్స్‌లో టైగర్‌కు బెస్ట్ విషెస్ చెబుతాడేమో చూడాలి మరి.