Raviteja : ఈగల్ పై రవితేజ ఫస్ట్ రివ్యూ..
మాస్ మహారాజ (Mass Maharaja) రవితేజ (Ravi Teja) హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) కాంబోలో తెరకెక్కిన భారీ యాక్షన్ మూవీ (Action Movie) ఈగల్.. (Eagle) ఫిబ్రవరి 9న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానున్న ఈ మూవీ కోసం రవితేజ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..

Ravi Teja's first review on Eagle..
మాస్ మహారాజ (Mass Maharaja) రవితేజ (Ravi Teja) హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) కాంబోలో తెరకెక్కిన భారీ యాక్షన్ మూవీ (Action Movie) ఈగల్.. (Eagle) ఫిబ్రవరి 9న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానున్న ఈ మూవీ కోసం రవితేజ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. అయితే.. తన సినిమా స్పెషల్ ప్రివ్యూను చూసిన రవితేజ ఫస్ట్ రివ్యూ కూడా ఇచ్చేసాడు. ఈ ప్రివ్యూ చూసిన రవితేజ ఫుల్ హ్యాపీ అయ్యాడు.. ఈగల్ అవుట్‌పుట్ విషయంలో ఐ యామ్ సూపర్ సాటిస్పైడ్ అంటూ కామెంట్స్ చేశాడు., దర్శకుడిని అభినందించాడు. రవితేజ సినిమా చూస్తూ ఎంజాయ్ చేసిన వీడియోను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), కావ్య థాపర్ (Kavya Thapar) హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.. ఈ సినిమాలో రవితేజ లుక్ డిఫరెంట్‌గా ఉండడం మరింత హైప్‌ను తీసుకొచ్చింది.. ఇక.. ఈగల్ మూవీ ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసింది.. ఇక.. స్పెషల్ ప్రివ్యూను రవితేజతో పాటు.. మరికొందరు టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా అటెండ్ అయినట్లు సమాచారం. వారంతా కూడా సినిమా విషయంలో ఫుల్ పాజిటివ్‌గా ఉన్నట్లు తెలిసింది. ఈగల్ రవితేజ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడం ఖాయమంటూ సినీ ప్రముఖులు చెప్పినట్లు వార్తలొస్తున్నాయి.
స్నైపర్ పాత్రలో రవితేజ యాక్టింగ్, యాక్షన్ తో ఇరగదీస్తాడని ఫ్యాన్స్ కూడా ఇప్పటికే ఫిక్సయిపోయారు.. కాగా.. ఈగల్ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయాలని నిర్మాత నిర్ణయించుకున్నారు. కానీ సంక్రాంతి బరిలో గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ, హనుమాన్ సినిమాలు నిలవడంతో థియేటర్ల సమస్య ఏర్పడింది. ఒకేసారి ఐదు స్ట్రెయిట్ సినిమాలు రిలీజైతే అన్ని సినిమాలు నష్టపోయే ప్రమాదం ఉండడంతో.. ఈగల్ ఫిబ్రవరి 9కి వాయిదా పడింది.