RAVI TEJA: హిట్ గ్యారెంటీ! రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ ఆ మూవీకి రీమేకా..!

టాలీవుడ్ కమర్షియల్ మూవీస్ డైరెక్టర్ హరీష్ శంకర్‌తో మాస్ మహారాజ్ చేస్తోన్న మూవీ 'మిస్టర్ బచ్చన్'. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన 'షాక్'.. ప్రేక్షకులకు షాక్ ఇచ్చినా.. ఆ తర్వాత వచ్చిన 'మిరపకాయ్' భారీ సక్సెస్ అందుకుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 19, 2023 | 06:38 PMLast Updated on: Dec 19, 2023 | 6:38 PM

Ravi Tejas New Film Titled Mr Bachchan Is A Remake Of Bollywood Film Ride

RAVI TEJA: రవితేజ – హరీష్ శంకర్ కాంబోలో ముచ్చటగా వస్తోన్న మూడో మూవీ ‘మిస్టర్ బచ్చన్’. ఈ మూవీ బాలీవుడ్ మూవీకి రీమేకా..? స్టోరీ ఏంటి..? హరీశ్ శంకర్‌కు రీమేక్స్ కలిసొస్తాయనే ఇలా డిసైడ్ అయ్యాడా..? టాలీవుడ్ కమర్షియల్ మూవీస్ డైరెక్టర్ హరీష్ శంకర్‌తో మాస్ మహారాజ్ చేస్తోన్న మూవీ ‘మిస్టర్ బచ్చన్’. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘షాక్’.. ప్రేక్షకులకు షాక్ ఇచ్చినా.. ఆ తర్వాత వచ్చిన ‘మిరపకాయ్’ భారీ సక్సెస్ అందుకుంది. మళ్లీ లాంగ్ గ్యాప్ తర్వాత సేమ్ కాంబోలో వస్తోంది మిస్టర్ బచ్చన్. ఈ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

SALAAR: ప్రభాస్‌ డ్యుయల్‌ రోల్‌ కన్ఫార్మ్‌.. ఇంకెన్ని సర్‌ప్రైజ్‌లు ప్లాన్‌ చేశావ్ నీల్‌ మావా..

అదేంటంటే.. హిందీలో అజయ్ దేవగన్ నటించిన ‘రైడ్’ సినిమా ఆధారంగా మిస్టర్ బచ్చన్ తీయబోతున్నాడట హరీష్ శంకర్. పారిశ్రామికవేత్త సర్దార్ ఇందర్ సింగ్‌పై దాదాపు మూడు రోజులపాటు జరిపిన ఇన్‌కమ్ టాక్స్ రైడ్ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇప్పుడు ఇదే సినిమా ఆధారంగా మిస్టర్ బచ్చన్ మూవీని తన స్టైల్‌లో రవితేజ ఇమేజ్‌కి తగినట్లుగా, కమర్షియల్ అంశాలను కలిపి హరీష్ శంకర్ రీమేక్ చేయబోతున్నాడని టాక్. ఓ రకంగా చెప్పాలంటే హరీష్ శంకర్ రీమేక్ కింగ్. ఒరిజనల్ ఫిల్మ్ కన్నా రీమేక్‌ని మరింత ఇంట్రెస్టింగ్‌గా మార్చడంలో హరీష్ దిట్ట. గతంలో సల్మాన్ ఖాన్ ‘దబాంగ్’ని ‘గబ్బర్ సింగ్’‌గా రీమేక్ చేసి పవన్ కళ్యాణ్ కెరియర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించాడు. ఒరిజినల్ వెర్షన్ కన్నా రీమేక్ వెర్షన్ అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది. ఆ తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ‘జిగర్తాండ’ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ ‘గద్దల కొండ గణేష్’ పేరుతో రీమేక్ చేసి మరో సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు రవితేజతో తీస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ మూవీ కూడా ‘రైడ్’ మూవీకి రీమేక్ అనే విషయం బయటకు రావడంతో పక్కాగా ఈ మూవీ కూడా ఒరిజినల్ కన్నా బెటర్‌గా ఉంటుందని ఫిక్సైపోయారు రవితేజ ఫ్యాన్స్.

పవన్‌ కళ్యాణ్‌తో ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమాను మొదలు పెట్టిన హరీష్ శంకర్‌.. ప్రస్తుతానికి ఆ సినిమాను పక్కన పెట్టాడు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి తర్వాత ఉస్తాద్‌ భగత్ సింగ్ షూటింగ్ ముగించే అవకాశాలున్నాయి. ఈలోగా జెట్‌ స్పీడ్‌తో రవితేజ మూవీ కంప్లీట్ చేయాలని డిసైడయ్యాడు హరీష్. రీమేక్ అయితే చాలా స్పీడ్‌గా పూర్తి అవుతుందనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాడట. రైడ్‌ కాన్సెప్ట్‌ రవితేజ బాడీ లాంగ్వేజ్‌కి, ఇమేజ్‌కి సరిగ్గా సరిపోతుందని, హిట్ పక్కా అంటున్నారు ఆడియన్స్. టైటిల్‌తోనే తన మార్పులు మొదలెట్టిన హరీష్ శంకర్.. స్టోరీలోనూ అవసరమైన మార్పులు, చేర్పులు చేసేపనిలో పడ్డాడు. రవితేజ సరసన బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీకి మిక్కీ జే మేయర్ సంగీత దర్శకుడు. మొత్తానికి హరీష్ జోరు చూస్తుంటే సమ్మర్ బరిలో దిగేట్టున్నాడు రవితేజ.