RAVITEJA: రవితేజని కంగారుపెట్టిస్తున్న హిందీ, తమిళ్ సినిమాలు!

ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవల్లో మాస్ మహారాజా రవితేజ.. టైగర్ నాగేశ్వరరావుగా బాక్సాఫీస్ మీద దండెత్తుతున్నాడు. మరి నార్త్‌‌తో పాటు తమిళ్ మార్కెట్‌లో తన సీన్ ఎంతో తేలబోయేది ఈ వారమే. ఈ ఇద్దరికి మూడు చోట్ల గట్టిపోటీ ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 16, 2023 | 06:07 PMLast Updated on: Oct 16, 2023 | 6:07 PM

Raviteja And Balakrishna Facing Heavy Competetion From Leo And Ganpath

RAVITEJA: నటసింహం బాలయ్య పెద్ద బాలశిక్షకి రెడీ అయ్యాడు. చిన్న బాలశిక్షకి మాస్ మహారాజా రవితేజ ప్రిపేర్ అవుతున్నాడు. నిజంగానే వీళ్లకు ఇదిప్పుడు పరీక్షాకాలం. ఇంతకాలం బాలయ్య ఎన్నడూ నైజాం యాసలో, ఆ బ్యాక్ డ్రాప్‌లో సినిమా చేయలేదు. అలాంటిది ఇప్పడు అనిల్ రావిపుడి మేకింగ్‌లో భగవంత్ కేసరి మూవీ చేశాడు. అదెంతవరకు వర్కవుట్ అవుతుంది..? నైజాం యాసతో బాలయ్య మ్యాజిక్‌కి సీన్ ఎంతుందనేది ఈ వారమే తేలబోతోంది. ఇలానే ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవల్లో మాస్ మహారాజా రవితేజ.. టైగర్ నాగేశ్వరరావుగా బాక్సాఫీస్ మీద దండెత్తుతున్నాడు.

మరి నార్త్‌‌తో పాటు తమిళ్ మార్కెట్‌లో తన సీన్ ఎంతో తేలబోయేది ఈ వారమే. ఈ ఇద్దరికి మూడు చోట్ల గట్టిపోటీ ఉంది. నార్త్‌లో రవితేజ మూవీకి టైగర్ ష్రాఫ్ మూవీ గణపథ్ పోటీ ఇచ్చేలా ఉంది. అసలే సలార్‌లాంటి కాన్సెప్ట్‌తో వస్తోందంటే ఆ ఊపు వేరేలెవల్లో ఉంటుంది. ఇక లియో నార్త్‌లో రవితేజ మూవీకి పోటీ అనకపోయినా కోలీవు్డ్‌లో మాత్రం లియోతో టైగర్ నాగేశ్వరరావు పోటీ పడటం చాలా కష్టం. సో.. ఎలా చూసినా ఈ ఇద్దరు తెలుగు హీరోలకి, కోలీవుడ్, బాలీవుడ్‌లోనే కాదు.. సొంత తెలుగు మార్కెట్‌లో కూడా పరీక్షలా మారాయి ఈ పండక్కి వచ్చేసినిమాలు. మరి ఈ సీనియర్ హీరోలు ఎలా సత్తా చాటుతారో చూడాలి.