RAVI TEJA: మార్కెట్‌ను మించి రెమ్యునరేషన్ అడుగుతున్న రవితేజ.. షాక్‌లో నిర్మాతలు

ధమాకా హిట్ తర్వాత తనకిక తిరుగులేదనుకున్నాడు. కానీ టైగర్ నాగేశ్వరావు అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. అయినా కూడా వెనక్కి తగ్గట్లేదు రవితేజ. ఒక్కసారిగా తన రెమ్యూనరేషన్ రూ.20 నుంచి రూ.35 కోట్లకి పెంచేశాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 19, 2023 | 05:35 PMLast Updated on: Dec 19, 2023 | 5:35 PM

Raviteja Demanding High Remuneration Irrespective Of His Market

RAVI TEJA: వయసు అయిపోతుంది కనుక చకచకా సంపాదించాలనుకుంటున్నాడు మాస్ మహారాజా రవితేజ. సినిమా హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా రెమ్యూనరేషన్ పెంచుకుంటూ వెళ్లిపోతున్నాడు. ధమాకా హిట్ తర్వాత తనకిక తిరుగులేదనుకున్నాడు. కానీ టైగర్ నాగేశ్వరావు అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. అయినా కూడా వెనక్కి తగ్గట్లేదు రవితేజ. ఒక్కసారిగా తన రెమ్యూనరేషన్ రూ.20 నుంచి రూ.35 కోట్లకి పెంచేశాడు.

Prashanth Neel: కేజీఎఫ్‌కి చేసిన తప్పే ‘సలార్’కి చేశానన్న ప్రశాంత్ నీల్

2022లో ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ వస్తే.. రెండూ ఫ్లాప్ అయ్యాయి. ధమాకా రవితేజని రక్షించింది. మళ్లీ 2023లో వాల్తేర్ వీరయ్యలో రోల్ డ్యూరేషన్ తక్కువే ఉన్నా ఆ మూవీ మళ్లీ రవితేజని నిలబెట్టింది. వాల్తేరు వీరయ్యలో చిరంజీవి రికమండేషన్‌తో మైత్రీ మూవీస్ రవితేజకు 20 నిమిషాల రోల్‌కిగాను రూ.20 కోట్ల రూపాయలు ఇచ్చారు. వాల్తేరు వీరయ్య సక్సెస్ అయిన వెంటనే మాస్ మహారాజాకు రెండు పెద్ద దెబ్బలు తగిలాయి. రావణాసుర, టైగర్ నాగేశ్వరావు.. రెండూ ఊహించని విధంగా ఫ్లాప్ అయ్యాయి. సినిమాలు ప్లాప్ అయినా రవితేజ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం తగ్గలేదు. ఇటీవల మైత్రీ మూవీస్ నిర్మాతలు నవీన్, రవిలతో చర్చలకు కూర్చున్న రవితేజ.. రెమ్యనరేషన్ ఏకంగా రూ.35 కోట్లు అడిగాడంట. ఒక్కసారిగా నిర్మాతలు కళ్ళు తేలేశారు. అసలు రవితేజకి మార్కెట్ ఎంతుంది..?

ఓవరాల్‌గా సినిమా ఎంతకి బిజినెస్ చేయగలుగుతాం తెలుసుకోకుండా రవితేజ ఏకంగా రూ.35 కోట్లు అడిగేటప్పటికి ఏం చేయాలో అర్థం కాక బిత్తర చూపులు చూశారంట మైత్రీ నిర్మాతలు. అంత రెమ్యూనరేషన్ అయితే చేయలేమంటూ నమస్కారం పెట్టి వెళ్లిపోయారు నిర్మాతలు. ఈ నేపథ్యంలో రవితేజ తన మార్కెట్ ఎంతో తెలుసుకోకుండా ఓవరాక్షన్ చేస్తున్నాడని నిర్మాతలు ఒకరిద్దరి దగ్గర వాపోయారట. అదే సమయంలో పీపుల్స్ మీడియా అధినేత విశ్వ ప్రసాద్.. రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్లో మిస్టర్ బచ్చన్ షూటింగ్ స్టార్ట్ చేశారు. మాస్ మహారాజా ఎక్స్పెక్టేషన్స్‌కి తగినట్లు రూ.35 కోట్లు ఇచ్చారా..? అంతకన్నా తక్కువకే బేరం ఆడుకున్నారా..? తెలీదు. కానీ, మొత్తానికి రీమేక్‌కి ఓకే చేయించారు పీపుల్స్ మీడియా విశ్వ ప్రసాద్.