RAVITEJA-NITHIN: రవితేజ, నితిన్, శర్వానంద్ పంట పండేలా చేస్తున్న స్టార్స్

ఓరకంగా చూస్తే నితిన్, శర్వానంద్, రవితేజ అండ్ కో కి పెద్దగా డిమాండ్ లేదు. కాని ఇప్పుడు సడన్‌గా పెరిగింది. కారణం పాన్ ఇండియా హీరోలు. పాన్ ఇండియా రేంజ్ కాదనుకున్న సినిమాలకు రవితేజ, శర్వానంద్, నితిన్ అండ్ కో దిక్కయ్యారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 9, 2024 | 04:11 PMLast Updated on: Mar 09, 2024 | 4:11 PM

Raviteja Nithin And Tier 2 Heroes Getting High Remuneration

RAVITEJA-NITHIN: మాస్ మహారాజా రవితేజ ఈగిల్ పోయింది. దీనికి ముందు టైగర్ నాగేశ్వరరావు ఫ్లాపైంది. అయినా తన రెమ్యునరేషన్ 25 కోట్లకు రూపాయి తగ్గించనన్నాడు. విచిత్రం ఏంటంటే నిర్మాతలు మరో ఐదు కోట్లు తీసుకోమనేస్తున్నారు. ఇలాంటి విచిత్రమైన పరిస్థితే నితిన్‌కి వచ్చింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్‌గా తన సినిమాలను ప్రమోట్ చేసుకుంటూ పోతున్న ఈ హీరోకి.. పుష్కరానికో హిట్ వస్తోంది. దీంతో ఫేట్ మారట్లేదు.

Sai Dharam Tej: పేరు మార్చుకున్న మెగా హీరో.. కొత్త పేరు ఏంటంటే..

ఓరకంగా చూస్తే నితిన్, శర్వానంద్, రవితేజ అండ్ కో కి పెద్దగా డిమాండ్ లేదు. కాని ఇప్పుడు సడన్‌గా పెరిగింది. కారణం పాన్ ఇండియా హీరోలు. ప్రభాస్ నుంచి రామ్ చరణ్, ఎన్టీఆర్ వరకు అంతా పాన్ ఇండియా హీరోలయ్యారు. బన్నీ కూడా పాన్ ఇండియా మార్కెట్‌కే పరిమితమయ్యాడు. వీళ్లు చేస్తే దేశం కుదిపేసే మూవీ చేయాల్సిందే తప్ప, వందకోట్లు రెండొందల కోట్ల బడ్జెట్ అంటే వీళ్ల ఇమేజ్ పరంగా అవి లోబడ్జెట్ మూవీలే. ఇక్కడే సమస్య వచ్చింది. మహేశ్ బాబు కూడా ఆలిస్ట్‌లోకి వెళ్లబోతున్నాడు. నాని కూడా పాన్ ఇండియా మార్కెట్ మీదే ఫోకస్ పెంచాడు. చిరు, రజినీ, కమల్, ఇలా అందరి రేంజ్ వేరు. సో 50 కోట్లు, 100 కోట్ల లోపు బడ్జెట్ మూవీలు తీయాలంటే పవన్ నుంచి మహేశ్ వరకు సాధ్యం కాదు. అలాగే.. ప్రభాస్, బన్నీ, చెర్రీ, తారక్ పాన్ ఇండియా స్టార్లవ్వటంతో 300 నుంచి 500 కోట్ల బడ్జెట్ మూవీలే చేస్తారు.

అందుకే పాన్ ఇండియా రేంజ్ కాదనుకున్న సినిమాలకు రవితేజ, శర్వానంద్, నితిన్ అండ్ కో దిక్కయ్యారు. వాళ్లు కూడా లేకపోతే కొత్తవాళ్లు, లేదంటే సుహాస్ లాంటి చిన్న వాళ్లతో సర్ధుకుపోవాలి. అక్కడే వెంకీ, నాగ్, రవితేజ అండ్ కోకి డిమాండ్ పెరిగింది. వీళ్ల రెమ్యునరేషన్ సక్సెస్ రేటుతో సంబంధంలేకుండా పెరిగిపోతోంది. టైర్ 2 హీరోల ఫేట్ మారిపోతోంది.