Raviteja: రావణాసుర ట్రైలర్‌ రివ్యూ

వరుస హిట్స్‌తో మంచి జోష్‌లో ఉన్న రవితేజ నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ రావణాసురపై ఫ్యాన్స్‌ ఓ రేంజ్‌లో హోప్స్‌ పెట్టుకున్నారు. ఇవాళ రిలీజైన ఈ సినిమా ట్రైలర్‌ ఓ వర్గం ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది. టైటిల్‌లో ఉన్నంత ఇంపాక్ట్‌ ట్రైలర్‌ కట్‌లో కానీ, డైలాగ్స్‌లో కానీ కనిపించలేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 28, 2023 | 11:30 PMLast Updated on: Mar 28, 2023 | 11:30 PM

Raviteja Ravanasura Trailer Review

సుధీర్‌ వర్మ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో రవితేజ లాయర్‌ పాత్రలో కనిపించబోతున్నాడు. 2 నిమిషాల డ్యురేషన్‌తో ఉన్న ట్రైలర్‌లో కామెడీ, యాక్షన్‌ సీన్స్‌ సమానంగా ఉన్నాయి. కోర్టులో న్యాయాన్ని కాపాడూతూనే బయట అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే హీరోగా రవితేజ కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది. హత్యలు చేస్తున్న హీరోను పట్టుకునేందుకు సాగే యాక్షన్‌ సస్పెన్స్‌ త్రిల్లర్‌ జోనర్‌లో సినిమా రూపొందినట్టు తెలుస్తోంది.

జాతిరత్నాలు ఫేస్‌ ఫరియా అబ్ధుల్లా ఈ సినిమాలో మరోసారి లాయర్‌గా కనిపించనుంది. జయరామ్‌, రావు రమేష్‌ లాంటి సీనియర్‌ యాక్టర్స్‌ కీ రోల్‌ ప్లేచేస్తున్నారు. ఎన్నో అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమాకు ట్రైలర్‌ మాత్రం చాలా రొటీన్‌గా కట్‌ చేశారు. రవితేజ క్యారెక్టర్‌లో ఉన్న రెండు షేడ్స్‌ను చాలా సింపుల్‌గా ప్రజెంట్‌ చేశారు. డైలాగ్స్‌లో కూడా టైటిల్‌లో ఉన్నంత ఇంపాక్ట్‌ లేదు. జోకర్‌ మూవీ తరహాలో యాంటీ హీరో ఫార్మాట్‌లో రవితేజను ప్రజెంట్‌ చేసేందుకు ట్రై చేశారు. యాక్షన్‌ సీన్స్‌కు తగ్గట్టుగా బీజీఎం ఎట్రాక్ట్ చేస్తుంది. మోస్ట్‌ హ్యాపెనింగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా మారిన భీమ్స్‌ సిసిరోలియో, హర్షవర్ధన రామేశ్వర్‌ బీజీఎంతో మ్యాజిక్‌ చేశారు. సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది. ఏప్రిల్‌ 7న ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు.