Raviteja: మంచే జరిగింది.. రవితేజ భలే తప్పించుకున్నాడు..

కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా ఉన్న 'హనుమాన్', 'గుంటూరు కారం', 'నా సామి రంగ' సినిమాలు.. టాక్‌ని బట్టి మంచి వసూళ్లనే రాబడుతున్నాయి. అయితే యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన 'సైంధవ్' కనీస వసూళ్లను కూడా రాబట్టలేకపోతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 18, 2024 | 01:02 PMLast Updated on: Jan 18, 2024 | 1:02 PM

Ravitejas Eagle Movie Postponed February Is A Good Decision

Raviteja: సంక్రాంతి సీజన్‌లో కుటుంబమంతా చూసి ఆనందించదగ్గ చిత్రాలను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తుంటారు. థ్రిల్లర్ జానర్ లేదా ఇతర విభిన్న చిత్రాలకు ఆ సమయంలో పెద్దగా ఆదరణ ఉండదు. ఈ విషయం తాజాగా మరోసారి రుజువైంది. ఈ సంక్రాంతికి ‘గుంటూరు కారం’, ‘హనుమాన్’, ‘సైంధవ్’, ‘నా సామి రంగ’ సినిమాలు విడుదలయ్యాయి. కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా ఉన్న ‘హనుమాన్’, ‘గుంటూరు కారం’, ‘నా సామి రంగ’ సినిమాలు.. టాక్‌ని బట్టి మంచి వసూళ్లనే రాబడుతున్నాయి.

Ayodhya Ram Mandir, Prabhas : రాజు గారంటే రాజుగారే మరి..! అయోధ్య భోజనం ఖర్చు ప్రభాస్ దే

అయితే యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘సైంధవ్’ కనీస వసూళ్లను కూడా రాబట్టలేకపోతోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉన్న వెంకటేష్ నటించిన సినిమా అయినప్పటికీ.. అందులో ఉన్న వయొలెన్స్ కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ ‘సైంధవ్’పై ఆసక్తి చూపించడం లేదు. ఒకవేళ ‘ఈగల్’తో సంక్రాంతి బరిలోకి దిగినట్లయితే రవితేజకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురయ్యేది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘ఈగల్’ కూడా సంక్రాంతికే విడుదల కావాల్సి ఉండగా, ఒకేసారి ఎక్కువ సినిమాలు విడుదలైతే థియేటర్ల సమస్య ఏర్పడుతుందన్న ఉద్దేశంతో ఫిబ్రవరి 9కి వాయిదా పడింది. తమ సినిమాని వాయిదా వేయాలని ‘ఈగల్’ టీం తీసుకున్న నిర్ణయం సరైనదనే కామెంట్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. సంక్రాంతి టైంలో ప్రేక్షకులు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్‌ని ఎక్కువగా ఆదరిస్తారు. పైగా రవితేజ నుంచి ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఆశిస్తారు.

కానీ ‘ఈగల్’ అనేది యాక్షన్ థ్రిల్లర్. ప్రచారాల చిత్రాలను బట్టి ఇది పూర్తిగా సీరియస్‌గా సాగే సినిమా అని అర్థమైంది. మామూలుగానే రవితేజ నటించిన సీరియస్ సినిమాలను ప్రేక్షకులు ఆదరించిన దాఖలాలు పెద్దగా లేవు. ఈ లెక్కన ఒకవేళ ‘ఈగల్’ సంక్రాంతికి విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా, కనీస వసూళ్లు కూడా వచ్చేవి కావేమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ‘ఈగల్’ వాయిదా కారణంగా ‘సైంధవ్’ తరహా షాక్ నుంచి రవితేజ తప్పించుకున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.