Rc15 look: ముస్లింగా రామ్‌ చరణ్‌ ? కేక పుట్టిస్తున్న #RC15 లుక్‌

ట్రిపులార్‌ లాంటి నెవర్‌ బిఫోర్‌ సినిమా తరువాత గ్లోబల్‌ స్టార్‌ రామచరణ్‌ శంకర్‌ డైరెక్షన్‌లో #RC15 సినిమాలో నటిస్తున్నాడు. చాలా ప్రేస్టీజియస్‌గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌ నుంచి ఇప్పటికే చాలా లీక్స్‌, లుక్స్‌ బయటికి వచ్చాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 24, 2023 | 09:00 PMLast Updated on: Mar 24, 2023 | 9:00 PM

Rc15 Ramcharan Muslim Look

ప్రతీ అప్‌డేట్‌కు ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. కానీ రీసెంట్‌గా అనుకోకుండా బయటికి వచ్చిన ఓ లుక్‌ మాత్రం సినిమా మీద ఓ రేంజ్‌ హైప్‌ క్రియేట్‌ చేసింది. ఈ ఫొటోలో రాచ్‌ చరణ్‌ కంటికి సుర్మా, వైట్‌ షర్ట్‌తో చూడటానికి ముస్లిం అబ్బాయిలా కనిపిస్తున్నాడు. బ్రహ్మానందం నటించిన రంగమార్తండ సినిమా హిట్‌ అవడంతో.. మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌ చరణ్‌ ఆయనను సన్మానించారు. బ్రహ్మానందానికి శాలువా కప్పుతూ దిగిన ఫొటోలో ఈ లుక్‌లో కనిపించాడు రామ్‌ చరణ్‌. నిమిషాల్లోనే ఈ ఫొటో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిపోయింది.

చరణ్‌ లుక్‌ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. చూసేందుకు చరణ్‌ ముస్లిం అబ్బాయిలా కానిపిస్తున్నాడంటూ కొందరంటున్నారు. ఈ లుక్‌తో RC15ను డీకోడ్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు నెటిజన్లు. శంకర్‌ సినిమాలో చరణ్‌ డుయల్‌ రోల్‌ చేస్తున్నాడంటూ చాలా కాలం నుంచి గాసిప్స్‌ వస్తున్నాయి. ఈ రెండు క్యారెక్టర్స్‌లో ఓ క్యారెక్టర్‌ ముస్లిం అబ్బాయిది అంటూ ఎవరికి వారు అంచనాలు వేస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే చరణ్‌ క్యారెక్టర్‌ ఎలా ఉండబోతోందంటూ చర్చించుకుంటున్నారు. ఫ్యాన్స్‌ అంచనాలు ఎలా ఉన్నా.. చరణ్‌ లుక్‌ మాత్రం అదిరిపోయిందంటున్నారు నెటిజన్లు.