Rc16 : చెర్రీ సరసన ఆ హీరోయిన్ ఫిక్స్..?
మెగా పవర్ స్టార్ (Mega Power Star) రామ్ చరణ్ (Ram Charan) ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో పాన్ ఇండియా (Pan India) స్టార్ హీరో అయిపోయాడు. ఇప్పుడు చరణ్ అంటేనే ఓ గ్లోబల్ స్టార్ అన్న బిరుదు వచ్చేసింది. ఇక.. ఆస్కార్ అవార్డ్స్ (Oscar Awards) సమయంలో చెర్రీ క్రేజ్ చూసి అందరూ షాక్ అయిపోయారు. ప్రస్తుతం చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్‌ఛేంజర్ (Game Changer) మూవీలో నటిస్తున్నాడు.

Rc16 Cherry vs that heroine fix..?
మెగా పవర్ స్టార్ (Mega Power Star) రామ్ చరణ్ (Ram Charan) ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో పాన్ ఇండియా (Pan India) స్టార్ హీరో అయిపోయాడు. ఇప్పుడు చరణ్ అంటేనే ఓ గ్లోబల్ స్టార్ అన్న బిరుదు వచ్చేసింది. ఇక.. ఆస్కార్ అవార్డ్స్ (Oscar Awards) సమయంలో చెర్రీ క్రేజ్ చూసి అందరూ షాక్ అయిపోయారు. ప్రస్తుతం చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్‌ఛేంజర్ (Game Changer) మూవీలో నటిస్తున్నాడు. ఇందులో చెర్రీ డ్యుయల్ రోల్‌లో మురిపించనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమాలోనూ నటిస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. కాగా.. ఈ మూవీకి సంబంధించిన ఓ లేటెస్ట్ అప్‌డేట్ వైరల్‌గా మారింది.
స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో చెర్రీ నటనకు అవార్డులు గ్యారంటీ అంటూ ఇప్పటి నుంచే మెగా ఫ్యాన్స్ హడావిడి చేస్తున్నారు.
ఇక ఈ మూవీకి సంబంధించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా ఫ్యాన్స్ దానిని వైరల్ చేస్తున్నారు. ఇక.. ఈ మూవీలో హీరోయిన్‌గా.. అతిలోక సుందరి తనయ జాన్వీకపూర్ నటించనుందని మూవీ టీం ఇప్పటికే రివీల్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరోయిన్ కి కూడా స్కోప్ ఉందని తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఈ రెండో హీరోయిన్ పాత్రలో కృతి సనన్ నటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే.. ఈ న్యూస్‌పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఈ ప్రెస్టీజియస్ మూవీకి ఆస్కార్ విన్నర్ ఎఆర్‌రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. యానిమల్ సినిమాతో విలన్ గా ఫామ్ లోకి వచ్చిన బాబీ డియోల్ కూడా ఈ సినిమాలో నటించే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. కాగా.. ఆర్‌సీ 16లో రాంచరణ్ ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడాల్సి ఉండగా.. దీని కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోబోతున్నట్టు ఇన్‌సైడ్ టాక్. అంతేకాదు రాంచరణ్ తన బాడీ లాంగ్వేజ్‌తోపాటు ఫిజికల్ ట్రాన్స్‌ఫార్మేషన్ కోసం కసరత్తులు చేయబోతున్నాడట. రాంచరణ్ నటించిన రంగస్థలం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన బుచ్చిబాబు ఈ సారి ఏకంగా మెగాఫోన్ పట్టనుండటం ఆసక్తికరంగా మారింది.