RC16 : సెట్స్ మీదకు వెళ్లేది అప్పుడే..
RRR తర్వాత మెగా పవర్ స్టార్ (Mega Power Star) రామ్ చరణ్ (Ram Charan) మూవీ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.. ఈ స్టోరీ లైనప్ ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీలో కూడా సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే చెర్రీ.. తన 15వ ప్రాజెక్టుగా శంకర్ దర్శత్వంలో “గేమ్ ఛేంజర్” గ్లోబల్ ఆడియన్సే టార్గెట్ గా సిద్ధమయ్యాడు.

RC16 goes on the sets only then..
RRR తర్వాత మెగా పవర్ స్టార్ (Mega Power Star) రామ్ చరణ్ (Ram Charan) మూవీ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.. ఈ స్టోరీ లైనప్ ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీలో కూడా సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే చెర్రీ.. తన 15వ ప్రాజెక్టుగా శంకర్ దర్శత్వంలో “గేమ్ ఛేంజర్” గ్లోబల్ ఆడియన్సే టార్గెట్ గా సిద్ధమయ్యాడు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ (Political action entertainer) గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం తరువాత రామ్ చరణ్ కమిట్ అయిన చిత్రం RC16. ఈ చిత్రం కి ఉప్పెన (Uppena) ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు (Buchi Babu) సన దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే.. ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ వైరల్ గా మారింది.
ఈ చిత్రం మార్చ్ నెలలో పూజా కార్యక్రమాలతో స్టార్ట్ కానుంది. రెగ్యులర్ షూటింగ్ మే నెల నుండి మొదలు కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై మేకర్స్ నుండి మరింత క్లారిటీ రావాల్సి ఉంది. మేకర్స్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ పై బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా.. ఈ మూవీపై వినిపిస్తున్న రూమర్లు మెగా ఫ్యాన్స్‌కు మంచి కిక్కిస్తున్నాయి.. RC16 పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లోనే స్పోర్ట్స్- డ్రామాగా తెరకెక్కనున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఓ కీలకపాత్రలో నటిస్తున్నారని తెలిపింది. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్న విషయాన్ని అధికారికంగానే ప్రకటించారు..
పీరియాడిక్ సినిమా అనగానే చెర్రీ RC16 మరో ‘లగాన్’ (Lagann) కాబోతుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. భారీ తారాగణంతో వస్తున్న శంకర్ ‘గేమ్ చేంజర్’ (game changer) తో పాటు RC16 పైనా భారీ ఆశలు పెట్టుకున్నారు చెర్రీ ఫ్యాన్స్.. కాగా.. ఈ మూవీ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్ళినా, 240 రోజుల్లో షూటింగ్ అంతా పూర్తి చెయ్యాలని భావిస్తున్నారట. అంతేకాదు 2025 మార్చి లాస్ట్ వీక్ లో రిలీజ్ చేసే విధంగా బుచ్చిబాబు అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారట. ఈ నెల 27న రామ్ చరణ్ బర్త్ డే (Ram Charan’s birthday) స్పెషల్ గా ఫస్ట్ లుక్ లేదా టైటిల్ అనౌన్స్ మెంట్ ఇచ్చే అవకాశం ఉంది.