సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు బుకింగ్స్ చూస్తే మెంటల్ వస్తుందిగా.. రీ రిలీజ్ కు ఇంత క్రేజ్ ఏంట్రా స్వామి..?
తెలుగు ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాలకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త సినిమాల కంటే వీటినే ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు.

తెలుగు ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాలకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త సినిమాల కంటే వీటినే ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు. సినిమా ఎలా ఉంటుందో ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి థియేటర్ కు అదే మూడ్ తో వెళ్లి ఫుల్ ఎంటర్టైన్ అవుతున్నారు. లవ్ స్టోరీ, యాక్షన్, కామెడీ.. ఇలా జానర్ తో పని లేకుండా అన్ని సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. ఒక్కోసారి రీ రిలీజ్ సినిమాలకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. ఇది నిజంగా పాత సినిమానేనా అనే డౌట్ వస్తుంది. తాజాగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ రిలీజ్ అవుతుంది. చాలా రోజులుగా ఈ సినిమాను మళ్ళీ విడుదల చేయాలి అంటూ నిర్మాత దిల్ రాజును అభిమానులు కోరుతూనే ఉన్నారు. ఇప్పటికే వాళ్ల కోరిక సంబంధించి మార్చి 7న ఈ సినిమాను మరోసారి విడుదల చేస్తున్నారు. దీనికి బుక్ మై షోలో టికెట్స్ భారీగా తిరుగుతున్నాయి.
ఒక్క రోజులోనే 20 వేల టికెట్లు అమ్ముడైపోయాయి అంటే సినిమా మీద ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతుంది. మహేష్ బాబు, వెంకటేష్ హీరోలుగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ సినిమా 2013 సంక్రాంతికి విడుదలైంది. తెలుగులో చాలా కాలం తర్వాత వచ్చిన అసలు సిసలైన మల్టీ స్టారర్ సినిమా కావడంతో అప్పట్లో కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. సినిమాలో పెద్దగా కథ లేకపోయినా కూడా కేవలం క్యారెక్టర్స్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాయి. అన్నింటికీ మించి పెద్దోడు, చిన్నోడు పాత్రలు ఇప్పటికీ బాగా గుర్తుండిపోయాయి. వెంకీ, మహేష్ మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ఇక సీత పాత్రలో అంజలి చాలా బాగా నటించింది. ప్రకాష్ రాజ్ రేలంగి మావయ్య పాత్ర ఇప్పటికీ ఫుల్ ట్రెండింగ్. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రీ రిలీజ్ అవుతున్నా కూడా ఈ సినిమా మీద ఇంత క్రేజ్ ఉంది.
దిల్ రాజు కూడా మామూలు తెలివైనవాడు కాదు. రీ రిలీజ్ చేయడానికి సరైన డేట్ కూడా కావాలి. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు కోసం పర్ఫెక్ట్ డేట్ పట్టుకున్నాడు దిల్ రాజు. మార్చి 7న చెప్పుకోదగ్గ సినిమాలు ఒక్కటి కూడా రావడం లేదు. ఈవారం సినిమాకి వెళ్దాం అనుకుంటే.. థియేటర్ వరకు రప్పించే సినిమాలు ఏమీ లేవు. అందుకే కరెక్ట్ టైం చూసుకుని సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మరోసారి విడుదల చేస్తున్నాడు దిల్ రాజు. దాంతో ఫ్యామిలీ ఆడియన్స్ మరొకసారి ఈ సినిమాను చూద్దాం అనుకుంటున్నారు. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు కుటుంబ ప్రేక్షకులు కూడా సీతమ్మ వాకిట్లో కోసం ఎదురు చూస్తున్నారు. టికెట్స్ బుక్ అవుతున్న ట్రెండింగ్ చూస్తుంటే మొదటి రోజు కచ్చితంగా 5 కోట్లకు పైగానే గ్రాస్ తీసుకొచ్చేలా కనిపిస్తుంది ఈ సినిమా. ఒకవేళ అదే జరిగితే మాత్రం అంతకంటే సంచలనం మరొకటి ఉండదు. ఈ సినిమా పేరు చెప్పి మరికొన్ని ఫ్యామిలీ సినిమాలను రీ రిలీజ్ కు రెడీ చేస్తారు మన నిర్మాతలు.