800 కోట్ల సరిపోలేదు.. రెబల్ రేంజే వేరసలు…
బాహుబలితో పాన్ ఇండియా కింగ్ గా మారిన రెబల్ స్టార్ ఒక వైపు, ప్యార్ లల్ గా వచ్చిన కేజీయఫ్ తో మరో రాజమౌళి అనిపించుకున్న ప్రశాంత్ నీల్ మరో వైపు... మరి వీళ్ల కాంబినేషన్ అంటే ఎలా ఉండాలి... భూమి బద్దలవ్వాలి... అదే సలార్ తో జరగింది. కాని 800 కోట్ల వసూళ్లు అసలు లెక్కే కాదంటున్నాడు ప్రశాంత్ నీల్.
బాహుబలితో పాన్ ఇండియా కింగ్ గా మారిన రెబల్ స్టార్ ఒక వైపు, ప్యార్ లల్ గా వచ్చిన కేజీయఫ్ తో మరో రాజమౌళి అనిపించుకున్న ప్రశాంత్ నీల్ మరో వైపు… మరి వీళ్ల కాంబినేషన్ అంటే ఎలా ఉండాలి… భూమి బద్దలవ్వాలి… అదే సలార్ తో జరగింది. కాని 800 కోట్ల వసూళ్లు అసలు లెక్కే కాదంటున్నాడు ప్రశాంత్ నీల్. తను ఊహే నిజమైతే, పాన్ ఇండియా లెవల్లో 4 వేల కోట్ల సినిమా ఇది అనేశాడు. అంతేకాదు, అసలు కథంతా సలార్ 2నే ఉందని, ఈ మూవీ 2026 లో రాబోతోందని కూడా తేల్చాడు. అసలు తన మొత్తం కెరీర్ లోనే ది బెస్ట్ స్క్రిప్ట్ అంటే సలార్ 2 అని సడన్ గా ఆ సీక్వెల్ మీద అంచనాలు పెంచేశాడు. ఫ్యాన్స్ ఫ్యూజులు ఎగిరిపోయే స్టేట్ మెంట్ ఇచ్చేశాడు. మరి డ్రాగన్ పరిస్తితేంటి? సలార్2 ది బెస్ట్ స్క్రిప్ట్ అయితే డ్రాగన్ స్క్రిప్ట్ ఆరేంజ్ ది బెస్ట్ కాదా..? ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమనుకోవాలి..?
సలార్ మూవీ లాస్ట్ ఇయర్ ఎండ్ కి వచ్చి 750 నుంచి 800 కోట్ల వసూళ్లు రాబట్టింది. మరో రెండు వందల కోట్లవసూళ్లొస్తే, రెబల్ స్టార్ కెరీర్ లో వెయ్యికోట్ల వసూళ్లు రాబట్టిన మూడోసినిమాగా హిస్టరీలో నిలిచేది ఈ సినిమా. కాకపోతే ఇలాంటి రిజల్ట్ ఎక్స్ పెక్ట్ చేయలేదన్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్, అసలు కథంతా సలార్ 2లోనే ఉంటే, ఇక పూనకాలంతా అక్కడకదా రావాలంటున్నారు
ఒక కథ అనుకున్న మూవీని రెండు భాగాలుగా విభజించటం వల్లే అసలు 80పర్సెంట్ కథ అందులో ఉండిపోయిందట. అంటే కేవలం 20పర్సెంట్ కంటెంట్ తోనే 800 కోట్లొచ్చాయంటే, అసలు కంటెంట్ సీక్వెల్ రూపంలో వస్తే బాహుబలినే మించిపోకుండా ఉండదు..
అసలే 5 పాన్ ఇండియా హిట్లున్న హీరో, బాహుబలి 2 తర్వాత ఆరేంజ్ హిట్ ని కేజీయఫ్ తోసొంతం చేసుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్… అలాంటి వీళ్ల కాంబినేషన్ లో సలార్ దుమ్ముదులిపింది. కాని 4 వేల కోట్ల రేంజ్ రిజల్ట్ వస్తుందనుకున్నాడట ప్రశాంత్ నీల్… అయినా అసలు కంటెంట్ తో సీక్వెల్ రూపంలో ఈ సారి 2026లో సినీ సునామీ కన్ఫామ్ అంటున్నాడు
అంటే 2026 లో సలార్ 2 వస్తుందని కన్ఫామ్ అయ్యింది. ఈలెక్కన 2025 లో సలార్ 2 పక్కగా పట్టాలెక్కే ఛాన్సే ఉంది. ఆల్రెడీ పార్ట్ 2 తాలూకు షూటింగ్ మొదటి భాగం టైంలోనే 20శాతం పూర్తి చేశాడు. కాబట్టి వేగంగానే సలార్ 2 మొదలై, పూర్తయ్యే ఛాన్స్ఉంది. ఇంతవరకు బానే ఉంది కాని, సలార్ 2 స్క్రీప్టే తన కెరీర్ లో ది బెస్ట్ స్క్రిప్ట్ అనటంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ లోపూనకాలొస్తున్నాయి
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో డౌట్లు పెరిగాయి. మరి సలార్ 2 మూవీ కథే గొప్పదైతే, డ్రాగన్ స్క్రిప్ట్ పరిస్థితేంటనే ప్రశ్నలు మొదలయ్యాయి. వార్ 2 షూటింగ్ తో బిజీ అయిన తారక్ ఫిబ్రవరి నుంచి ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లోడ్రాగన్ సెట్లో అడుగుపెట్టబోతున్నాడు. ఎంత సేపు సలార్ 2 మీద అప్ డేట్లు, స్టేట్ మెంట్లు ఇస్తూ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని నెగ్లెక్ట్ చేస్తున్నాడా? అసలు సలార్ 2 మీదే తన ప్రేమంత చూస్తుంటే, డ్రాగన్ స్క్రీప్ట్ ఓకేనా అన్నడౌట్లు మొదలయ్యాయి. అయితే సలార్ 2 మీద 2 నెలలుగా రెబల్ స్టార్ ఫ్యాన్స్ నుంచి సోషల్ మీడియాలో ప్రశ్నలు ఎదురౌతుండటంతో, ఇలా సమాధానం చెప్పాడు డైరెక్టర్. అలా వాల్లని ప్రశాంత్ నీల్ కూల్ చేశాడే కాని, డ్రాగన్ మీద ఎలాంటి డౌట్లు పెట్టుకోవాల్సిన పనిలేదనే మాట డ్రాగన్ టీం నుంచి క్లియర్ కట్ గా వస్తోంది…