పవన్ కి ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ సపోర్ట్.. విచిత్ర విశ్వంతో సాధ్యం..
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ సడగన్ గా వాళ్ల అభిమానం పవర్ స్టార్ వైపు షిఫ్ట్ చేశారా? చేస్తున్నారా? ఈ డౌట్ రావటానికి ఒకే ఒక్క రీజన్ పవర్ స్టార్ చేస్తున్నమూవీ. ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నా పవన్ ప్రజెంట్ పరిపాలనతో బిజీ.. అసలు తన సినిమా షూటింగ్స్ కే ఛాన్స్ దొరకట్లేదు.
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ సడగన్ గా వాళ్ల అభిమానం పవర్ స్టార్ వైపు షిఫ్ట్ చేశారా? చేస్తున్నారా? ఈ డౌట్ రావటానికి ఒకే ఒక్క రీజన్ పవర్ స్టార్ చేస్తున్నమూవీ. ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నా పవన్ ప్రజెంట్ పరిపాలనతో బిజీ.. అసలు తన సినిమా షూటింగ్స్ కే ఛాన్స్ దొరకట్లేదు. కాబట్టి తన ఫ్యాన్సే తన మూవీ అప్ డేట్స్ కోసం ఎదురుచూసే ఛాన్స్ లేదు.. అలాంటి టైంలో సీన్ లోకి ప్రభాస్ ఫ్యాన్స్ వస్తున్నారు. దానికి కారణం అప్పడెప్పుడో వచ్చి హిట్టైన సాహో మూవీనే. బాహుబలి 2 తర్వాత వచ్చి నార్త్ ఇండియాని ఊపేసిన సాహో వల్లే పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కొత్త మూవీకి, రెబల్ స్టార్ ఫ్యాన్స్ సపోర్ట్ కూడా దక్కేలా ఉంది.. అదెలా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సడన్ గా రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ సపోర్ట్ దొరకటమే ఊహకందని లాజిక్. ఎందుకంట ప్రజెంట్ పవన్ సినిమా లు చేయట్లేదు, పరిపాలన తప్ప మరో ద్యాసలేదు. అలాంటిది సడన్ గా సీన్ లోకి రెబల్ స్టార్ ఫ్యాన్స్ వస్తున్నారు. ఒక వైపు పవన్ మూవీ మీద కన్నేశారు.. దాని వెనకే డైరెక్టర్ చెప్పే లాజిక్ మ్యాజిక్ చేస్తోంది
ది రాజా సాబ్ ని పూర్తి చేసి ఏప్రిల్ లో బాక్సాఫీస్ మీద దండెత్తాలనుకుంటున్న ప్రభాస్, తర్వాత ఫౌజీతో దసరాను టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. స్పిరిట్ తో 2026 ని లక్ష్యంగా మార్చుకునే ఛాన్స్ ఉంది
అంటే వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు రెబల్ స్టార్ తాలూకు సినీ సందడి ఉండదు. మరెందుకు రెబల్ స్టార్ ప్యాన్స్ సడన్ గా యాక్టివ్ అయ్యి, అందులోనూ పవన్ వైపు చూడటమే షాకింగ్ న్యూస్.. దీనికి కారణం పవర్ స్టార్ మూవీ ఓజీ.. ఈ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ కి పూర్తి స్థాయిలో రెబల్ స్టార్ ఫ్యాన్స్ సపోర్ట్ కూడా యాడ్ అయ్యేలా ఉంది
పవన్ కి ఉన్న హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి రెబల్ స్టార్ ఫ్యాన్స్ తోడైతే, ఇక బాక్సాఫీస్ లో సినీ సునామే.. ఇలాంటి చర్చకి కారణం ఓజీ మూవీకి, ప్రభాస్ పాత హిట్ ఫిల్మ సాహోకి లింక్ ఉండటం. ఫైనల్ గా ఈ రెండు సినిమాలు కూడా దర్శకుడి సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్నాయని తేలటం. ఆల్రెడీ గతంలోనే ఈ విషయం కన్ఫామ్ అయ్యింది. ఇప్పుడు సాహో లో హీరో పాత్రకి, ఓజీలో హీరో పాత్రతో లింక్ పెట్టడంతో ఓజీ వైపు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా చూసే పరిస్థితి వచ్చింది. ఐతే పవన్ పొలిటికల్ గా బిజీ అవటం వల్ల ఓజీ ఇప్పడప్పట్లో మొదలు కాదన్నారు. కాని వచ్చే దీపావలికి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నఈ మూవీ టీం, మొత్తానికి ఓజీ, సాహో కనెక్షన్ ని రివీల్ చేసి, సడన్ గా ఫ్యాన్స్ లో ఎక్స్ పెక్టేషన్స్ పెంచాడు డైరెక్టర్ సుజీత్.