Rebal Star: 100 నగరాల్లో ప్రభాస్.. ఫ్యాన్స్ కోసం బయటికి యంగ్ రెబల్ స్టార్..
యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి పండగలాంటి న్యూస్ ఏంటంటే, ప్రభాస్ షూటింగ్స్ వల్ల అగ్నాతంలోకి వెళ్లాడు.. ఇప్పుడు పూర్తిగా జనాల్లోకి, ముఖ్యంగా ఫ్యాన్స్ ని కలిసేందుకు ఏకంగా 40రోజులు కేటాయిస్తున్నాడు. రంగం సిద్దమైంది. ఫ్యాన్స్ పండగ చేసుకునే టైం వచ్చింది.

Aadipurush Promotions in 100 citys
ఆదిపురుష్ పాటతో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరగటంతో, మొత్తానికి టీజర్ మీద జరిగిన ట్రోలింగ్ ని మర్చిపోయిన ఫ్యాన్స్ కి అంతకుమించేలా గుడ్ న్యూస్ వచ్చేసింది. ఆదిపురుష్ ప్రమోషన్స్ కోసం 100 నగరాల్లో పర్యటించబోతున్నాడట ప్రభాస్.
ఆదిపురుష్ మూవీ రిలీజ్ కి ఇంకా 38 రోజుల టైమే ఉంది. అందుకే సలార్ షూటింగ్ ప్యాచ్ వర్క్ కి బ్రేక్ ఇచ్చి ఏకంగా 40 రోజుల్లో 100 నగరాలు చుట్టి, ఆదిపురుష్ కి ప్రచారం చేయబోతున్నాడు ప్రభాస్.. సినిమా రిలీజైన 15 వ రోజు వరకు కూడా తను దేశం మొత్తం చక్కర్లుకొడతాడని తెలుస్తోంది. సో అసలు సందడి మొదలైంది. తర్వాత 10 రోజుల గ్యాప్ ఇచ్చిన మళ్లీ సలార్ ప్రమోషన్ కి కూడా ప్రభాస్ రెడీ అవ్వొచ్చని తెలుస్తోంది.