రెబల్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ కంటే తోపా..? 300 కోట్ల జోక్ ఇది…
పాన్ ఇండియా కింగ్స్ అంటే రెబల్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెసే... ఈ ఇద్దరు పాన్ ఇండియాని సోలోగా షేక్ చేశారు. నార్త్ ఇండియాలో హార్డ్ కోర్ మాస్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. అన్నీటికంటే 500కోట్ల రెమ్యునరేషన్ తో ప్రభాస్ ఏకంగా హాలీవుడ్ స్టార్ల లిస్ట్ లోనే చేరాడు.
పాన్ ఇండియా కింగ్స్ అంటే రెబల్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెసే… ఈ ఇద్దరు పాన్ ఇండియాని సోలోగా షేక్ చేశారు. నార్త్ ఇండియాలో హార్డ్ కోర్ మాస్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. అన్నీటికంటే 500కోట్ల రెమ్యునరేషన్ తో ప్రభాస్ ఏకంగా హాలీవుడ్ స్టార్ల లిస్ట్ లోనే చేరాడు. దేవర హిట్ తర్వాత వార్ 2 మూవీ చేస్తూ 350 కోట్ల రెమ్యునరేషన్ తో మ్యాన్ ఆఫ్ మాసెస్ కూడా ఖాన్స్ అండ్ కపూర్స్ ని మించిపోయాడు. సో పారితోషికం పరంగా కూడా పాన్ ఇండియా నెం.1, నెంబర్ 2 అంటే ప్రభాస్, ఎన్టీఆర్ లే అంటున్నారు. కాని సడన్ గా సీన్ లోకి పుష్పరాజ్ వచ్చాడు. 300 కోట్లతో ఇండియా నెంబర్ వన్ అంటున్నారు. పుష్ పాన్ ఇండియా హిట్టే… ఆ సినిమాకు బన్నీ 100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడు.. అంతవరకు ఓకే కాని, పాన్ ఇండియాలో 300 కోట్లతో తానే నెంబర్ వన్ అని ప్రచారం జరుగుతోంది. అక్కడ అసలు రగడ మొదలౌతోంది. ఎన్టీఆర్, ప్రభాస్ పారితోషికం పర్వాతలెక్కుతుంటే, పాన్ ఇండియా నెంబర్ వన్ ప్రచారమే దారితప్పుతోందనే గొడవ షురూ అయ్యింది.
పుష్ప 2 ప్రమోషన్ కోసం ఫిల్మ్ టీం చేయాల్సిందంతా చేస్తోంది. ఆప్రాసెస్ లోనే 300 కోట్ల రెమ్యునరేషన్ తో ఇండియా నెంబర వన్ హీరో బన్నీ అంటూ ప్రచారం చేస్తోందనే కామెంట్స్ పెరిగాయి. ఇవే రెబల్ స్టార్ ఫ్యాన్స్ ని, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులను ఫైర్ అయ్యేలా చేస్తున్నాయి.
నిజానికి 300 కోట్ల రెమ్యునరేషన్ ని ఎన్టీఆర్, ప్రభాస్ ఎప్పుడో దాటేశారు. త్రిబుల్ ఆర్ కి 100 కోట్ల పారితోషికం తీసుకున్న తారక్, దేవరకి 200కోట్ల రెమ్యునరేషన్ గా అందుకున్నాడు. ఇక 300 కోట్ల పారితోషికం హిందీ మూవీ వార్ 2 లో విలన్ రోల్ కి తాను అందుకుంటుంటే, డ్రాగన్ కి ఏకంగా 350కోట్ల రెమ్యునరేషన్ సొంతం చేసుకున్నాడు
అంటే 100 కోట్లనుంచి 350కోట్ల వరకు తన పారితోషికం కేవలం 2 ఏళ్లలో ఎక్కడికో పెరిగిపోయింది. ప్రభాస్ విషయానికొస్తే, బాహుబలికి 75 కోట్లు బాహుబలి 2 కి 150 కోట్లు తీసకుున్న తను, సాహోకి 200 కోట్లు, రాధేశ్యామ్, ఆదిపురుష్ కి ఏకంగా 250 కోట్ల పారితోషికంఅందుకున్నాడు. సలార్ కి 300 కోట్లు, కల్కీకి 350 కోట్లు తీసుకున్న ప్రభాస్, ఫౌజీ, స్పిరిట్ కి 500 కోట్లు తీసుకుంటున్నాడని తెలుస్తోంది
ఇలా చూస్తే ఎక్కడి 500 కోట్లు, ఎక్కడి బన్నీ 300కోట్లు.. అలానే ఎన్టీఆర్ 350 కోట్ల తో పోలిస్తే పుష్ప 2 కి బన్నీ తీసుకున్న 300 కోట్లు ఇంకా 50 కోట్లు తక్కువ. అయితే పుష్ప 2 కి నిజంగా బన్నీకి 300 కోట్లు సమర్పించుకుంటే 450 కోట్లలో 300 కోట్లు తనకే ఇస్తే, ఇక మిగతా 150 కోట్లలో అందరి రెమ్యునరేషన్ తీస్తే టోటల్ షూటింగ్ కి అయ్యింది 100 కోట్లేనా? ఇది నమ్మశక్యంగా ఉందా.?? ఇలాంటి డౌట్లతో తేలిందేంటంటే, పుష్ప2 హైప్ పెంచేందుకు 100 కోట్ల బన్నీని 300 కోట్ల స్టార్ గా మారుస్తున్నారనే కామెంట్లే పెరుగుతున్నాయి.