దీనెమ్మ రెబల్ దండయాత్ర, 2026… రెబల్ నామ సంవత్సరం
రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న సినిమాలు చూస్తుంటే సినిమా ఇండస్ట్రీపై పగబట్టినట్టే కనపడుతోంది. గతంలో ఎప్పుడూ ఇన్ని సినిమాలు ఇంత భారీ లైనప్ తో ప్రభాస్ చేయలేదు.
రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న సినిమాలు చూస్తుంటే సినిమా ఇండస్ట్రీపై పగబట్టినట్టే కనపడుతోంది. గతంలో ఎప్పుడూ ఇన్ని సినిమాలు ఇంత భారీ లైనప్ తో ప్రభాస్ చేయలేదు. ఇప్పుడు టాలీవుడ్ గాని బాలీవుడ్ గాని ఏ వుడ్ లో అయినా ఈ రేంజ్ లో ఇన్ని సినిమాలను లైన్ లో పెట్టిన స్టార్ హీరోలు ఎవరూ లేరు. ఆరు నెలలకు ఒక సినిమా చేస్తా అని ఒక ఫంక్షన్ లో చెప్పిన ప్రభాస్… ఇప్పుడు అదే పని చేయడం స్టార్ట్ చేసాడు. సినిమా ఇండస్ట్రీపై పగబట్టి సినిమాలు చేస్తూ… బాక్సాఫీస్ పై భారీ యుద్దమే చేస్తున్నాడు.
ఇక బాలీవుడ్ కాదు ఏ వుడ్ లో హీరోలు అయినా సరే ఇప్పుడు ప్రభాస్ ను బీట్ చేయడం కష్టమే. హోంబలే సంస్థతో ప్రభాస్ చేసుకున్న ఒప్పందం చూసి… ఇతర స్టార్ హీరోలకు చెమటలు పట్టాయి. కంటి మీద కునుకు లేకుండా బ్రతికే పరిస్థితి వచ్చింది. ఏకంగా 600 కోట్లతో ఆ సంస్థతో మూడు సినిమాలకు ఒప్పందం చేసుకున్నాడు. ఆ మూడు సినిమాలు 2026 నుంచి సలార్ 2 రిలీజ్ తో 2028 వరకు విడుదల అవుతాయి. హోంబలే సంస్థ పెట్టుబడి అంటే అంత ఈజీగా ఉండదు. భారీగానే ప్లాన్ చేసింది కాబట్టే పెట్టుబడి పెట్టడానికి రెడీ అయింది.
హోంబలే సంస్థ… తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే ప్లాన్ చేస్తూ ఉంటుంది. కాని ప్రభాస్ తో ఆ రేంజ్ లో పెట్టుబడి పెట్టడానికి రెడీ అయింది అంటే ఆ లైనప్ ఊహకు కూడా అందని పరిస్థితి. ఓ పక్కన ప్రభాస్ చేతిలో నాలుగు వేరే సినిమాలు ఉన్నా సరే… హోంబలే ఆ లైనప్ ను అనౌన్స్ చేసింది. ఇక ఇప్పుడు స్పిరిట్ సినిమాపై ఓ ప్రకటన వచ్చేసింది. ఇప్పటికే మ్యూజిక్ సహా ఇతర ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ అయినట్టు సందీప్ రెడ్డి వంగా ప్రకటన చేసాడు. ఇప్పుడు ఈ సినిమాపై నిర్మాత భూషణ్ కుమార్ ఓ ప్రకటన చేసాడు.
ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నా అని ఓ ప్రకటన చేసాడు. స్క్రిప్ట్ పూర్తి చేయడానికి సందీప్ రెడ్డి వంగా కష్టపడుతున్నాడు అని… డిసెంబర్ లో ముహూర్తం షార్ట్ తీస్తాం అని చెప్పాడు. ఇక 2025 జనవరి నుంచి సినిమా షూట్ స్పీడ్ గా జరుగుతుందని తెలిపాడు. కొన్ని సీన్స్ వేరే లెవెల్ లో ఉన్నాయని తెలిపాడు. 2026 మధ్యలో సినిమా రిలీజ్ ఉంటుందని ప్రకటించాడు. అంటే 2026 లో కల్కీ 2, సలార్ 2, స్పిరిట్ రిలీజ్ అవుతాయి. మూడు కూడా అత్యంత భారీ ప్రాజెక్ట్ లే. దీనితో 2026 ప్రభాస్ నామ సంవత్సరమే.