రష్యాలో రాజ్ కపూర్ తర్వాత రెబల్ స్టారే… బాహుబలి తర్వాత కల్కీ

రెబల్ స్టార్ ప్రభాస్ హిట్ మూవీ విడుదలైతే, తెలుగు రాష్ట్రాల్లో పండగ.. కాని ఇది ఒకప్పుడు... ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో తన హిట్ మూవీ రీ రిలీజ్ అయితే, దేశవ్యాప్తంగా పండగ చేసుకుంటున్నారు రెబల్ ఫ్యాన్స్.. అంతగా తన ఫ్యాన్ బేస్ పాన్ ఇండియా లెవల్లో విస్తరించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 5, 2024 | 04:50 PMLast Updated on: Nov 05, 2024 | 4:50 PM

Rebel Star After Raj Kapoor In Russia Kalki After Baahubali

రెబల్ స్టార్ ప్రభాస్ హిట్ మూవీ విడుదలైతే, తెలుగు రాష్ట్రాల్లో పండగ.. కాని ఇది ఒకప్పుడు… ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో తన హిట్ మూవీ రీ రిలీజ్ అయితే, దేశవ్యాప్తంగా పండగ చేసుకుంటున్నారు రెబల్ ఫ్యాన్స్.. అంతగా తన ఫ్యాన్ బేస్ పాన్ ఇండియా లెవల్లో విస్తరించింది. ఇప్పుడు విదేశాల్లో కూడా తనకి హార్డ్ కోర్ ప్యాన్స్ పెరిగిపోతున్నారు. లేకపోతే రష్యాలో ప్రభాస్ హిట్ మూవీ రీరిలీజ్ అంటే పండగ చేసుకోవటం నిజంగా వింతే. రెబల్ స్టార్ కి బాహుబలి వల్ల జపాన్ లో, రష్యాలో ఫ్యాన్స్ పెరిగారు. సాహో, సలార్, కూడా జపాన్, రష్యాలో సందడి చేసిందంటే కారణం ఆ ఫ్యాన్ బేసే. ఒకప్పుడు విదేశాల్లో మనహీరోలకి ఫ్యాన్స్ అంటే, అక్కడ సెటిలైన ఇండియన్సే కనిపించేవాళ్ళాు.. కాని రష్యాలో ప్రభాస్ ఫ్యాన్స్ లో 45 శాతం నేటివ్ రష్యన్సే కనిపిస్తున్నారు. ఒకప్పుడు ఇలా హిందీ లెజెండ్ రాజ్ కపూర్ కే ఈ రేంజ్ ఫాలోయింగ్ అక్కడ ఉండేది.. ఆతర్వాత ఇలాంటి క్రేజ్ ని అక్కడ సొంతం చేసుకున్న ఒకే ఒక్క ఇండియన్ హీరో రెబల్ స్టార్ ప్రభాసే.

రెబల్ స్టార్ ప్రభాస్ 2015 కి ముందు వరకు కేవలం తెలుగు హీరో మాత్రమే.. తెలుగు రాష్ట్రాల్లో నరాలు తెగిపోయేంత ఉత్కంటతో తన సినిమాలకోసం రెబల్ ఫ్యాన్స్ వేయిట్ చేయటం కామన్. ఇప్పుడు ఈ హీరో రేంజ్ రాష్ట్రం దాటి, దేశం దాటి విదేశాల వరకు వెల్లింది… తనకి సౌత్ ఇండియాలో డైహార్ట్ ఫ్యాన్స్ ఉంటే, పదేళ్ల క్రితం మాత్రం నార్త్ లో జస్ట్ ఫ్యాన్స్ ఉండేవాళ్లు. బాహుబలి రెండు హిట్ల తర్వాత తనకి నార్త్ లో కూడా డైహార్ట్ ఫ్యాన్స్ పెరిగారు.

సాహో తో ఆ ఫాలోయింగ్ పెరిగింది. రాధేశ్యామ్, ఆదిపురుష్ విషయంలో రిజల్ట్ నిరుత్సాహపరిచినా, నమ్మిన దర్శకులు డిసప్పాయింట్ చేసినా, ఆరెండు కూడా 300 కోట్ల నుంచి 600 కోట్లు రాబట్టి, ఓరేంజ్ పెట్టుబడిని కాపాడాయి.. అక్కడే తన క్రేజ్ ఏంటో మార్కెట్ లోతన సినిమాకున్నమైలేజ్ ఏంటో తేలింది.

కట్ చేస్తే ఇప్పుడు తన క్రేజ్ రష్యాలో కూడా ఓరేంజ్ లోపెరిగింది. జపాన్ లో బాహుబలి రెండు భాగాలు ట్రెండ్ సెట్ చేస్తే, సాహో అక్కడి జనాల్లో ప్రభాస్ మీద మరింత అభిమానం పెరిగేలా చేసింది. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ సలార్ రీసెంట్ గా అక్కడ రిలీజై రికార్డులు క్రియేట్ చేయటం…

సలార్ తర్వాత కల్కీ వంతొచ్చింది. జపాన్ లోనే కాదు, రష్యాలో కూడా ఇదే సీన్ రిపీట్ కాబోతోంది. బాహుబలితో, జన్మనీలో కూడా భారీగా గుర్తింపు తెచ్చుకున్నప్రభాస్, సలార్, కల్కీ రిలీజ్ లతో రష్యాలో దూసుకెళ్లాడు. కల్కీ అయితే అక్కడ విడుదలైనప్పుడు 1.62 మిలియన్లు అంటే దాదాపు పదికోట్ల వసూళస్లు వచ్చాయి. విచిత్రం ఏంటంటే, ఇప్పుడు మళ్లీ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అక్కడ కల్కీని రీరిలీజ్ చేశారు.

దానికి కూడా భారీ స్పందన రావటం నిజంగా విచిత్రమే… ఇండియాలో ఓ ఇండియన్ హీరో హిట్ మూవీ రీరిలీజ్ అయితే పూనకాలు రావటం కామన్. వసూళ్ల వరద రావటం కూడా కామనే.. కాని రష్యాలో, జపాన్ లో ఇలాంటి సీన్ క్రియేట్ అవటం చూస్తుంటే, పాన్ ఇండియా నుంచి పాన్ ఆసియా, పాన్ యూరేసియా వరకు రెబల్ స్టార్ ఇమేజ్ స్ప్రెడ్ అవుతోంది

బాలీవుడ్ లెజెండ్ రాజ్ కపూర్ సినిమాలు, పాటలు రష్యాలో ఫేమస్… తన సినిమాలు అప్పట్లో అక్కడ ట్రెండ్ సెట్ చేసేవి. ఆతర్వాత ఆరేంజ్ లో ఇండియన్ సినిమాలు అక్కడ ఆడటం అంటేప్రభాస్ విషయంలోనే జరుగుతోంది. బాహుబలి, సాహో, సలార్, కల్కీ ఇలా వరుసగా తన ప్రతీ మూవీ అక్కడ విడుదలౌ వసూళ్లు రాబట్టడమే కాదు, రీరిలీజ్ లకు కూడా కోట్లల్లో వసూళ్లు వచ్చే రేంజ్ ఇమేజ్ ప్రభాస్ సొంతమైంది.