రెబల్ స్టార్ ప్రభాస్ రెండేళ్ల క్రితం రెండు సినిమాలతో దాడి చేశాడు. అందులో సలార్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. కల్కీ మూవీ లాస్ట్ ఇయర్ 1200 కోట్లు కొళ్లగొట్టింది... నిజానికి 2024 లోనే ది రాజా సాబ్ కూడా రిలీజ్ అవ్వాలి.. కాని కాలేదు... అందుకే ఇయర్లీ రెండు సినిమాలతో పాన్ ఇండియాని షేక్ చేయాలన్న తన ప్లాన్ లాస్ట్ ఇయర్ వర్కవుట్ కాలేదు. అందుకే కల్కీ మాత్రమే గత ఏడాది వసూల్ల దాడి చేసింది. లాస్ట్ ఇయర్ రావాల్సిన ది రాజా సాబ్ ఈ ఏడాది సమ్మర్ కి వాయిదా పడింది. దాని వల్లే ఈ ఏడాది రెబల్ స్టార్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలతో మైండ్ బ్లాక్ చేయబోతున్నాడు. ఎలాగూ ఈ ఏడాదిమహేవ్, బన్నీ సినిమాలు రావు.. వాళ్ల మూవీలు రావలంటే మరో రెండేళ్లు వేయట్ చేయక తప్పదు. చరణ్ గేమ్ ఛేంజర్ వచ్చే వారమే వస్తోంది.. ఆతర్వాత తన సందడి కనిపించాలంటే కనీసం ఏడాది వేయిట్ చేయాలి..సో ఈ ఏడాదంతా తెలుగు హీరోల పాన్ ఇండియా దాడులు కనిపించే అవకాశం లేదు. కాని సీన్ లో రెబల్ స్టార్ ఉన్నాక అసలు అలాంటి బాదే అవసరం లేదని తేల్చేస్తున్నారు ప్రొడ్యూసర్స్.. నిజంగానే ఈ ఏడాది సీజన్ కో పాన్ ఇండియా మూవీతో దుమ్ముదులపబోతున్నాడు రెబల్ స్టార్. విచిత్రం ఏంటంటే, అన్నీ వర్కవుట్ అయితే మూడు మాత్రమే కాదు, నాలుగు సినిమాల దాడికి కూడా ఛాన్స్ ఉంది... బాక్సాఫీస్ లో బ్రహ్మండమేదో బద్దలయ్యేలా పరిస్థితి కనిపిస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ తో మారుతి తీస్తున్న సినిమా ఏప్రిల్ 10 కి రాకపోయినా, మరీ జూన్ వరకు వాయిదా పడకుండా సమ్మర్ లోనే రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆల్రెడీ 90 పర్సెంట్ టాకీ పార్ట్ షూటింగ్ పూర్తైంది. కేవలం 4 సాంగ్స్ షూటింగ్ తోపాటు రెండు ప్యాచప్ సీన్ల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ అని తెలుస్తోంది. సో సంక్రాంతి తర్వాత 20 రోజుల్లో ది రాజా సాబ్ షూటింగ్ పూర్తవ్వొచ్చు.. ఏప్రిల్ 10 ని రిలీజ్ మిస్ అయినా మే ఎండ్ లోపు ఈ సినిమా విడుదలయ్యే అవకశం ఉంది. విచిత్రం ఏంటంటే నిన్న కాక మొన్న మొదలై ఫౌజీ మూవీ ఆగస్ట్ లోగా పాటలతో సహా షూటింగ్ పూర్తవుతుందట. ఆల్రెడీ రెండె షెడ్యూల్స్ పూర్తి చేశాడు డైరెక్టర్ హాను రాఘవపూడీ. ఇది కాకుండా ప్రభాస్ గెస్ట్ రోల్ వేస్తున్న మంచు విష్ణు మూవీ కన్నప్ప కూడా ఈ ఏడాదే రాబోతోంది. అంటే ఒకే ఏడాది మూడు సినిమాలతో రెబల్ స్టార్ భారీ దండయాత్రలు చేసుందుకు సిద్దమైనట్టే.. కాకపోతే ది రాజా సాబ్ ఈజీగా వెయ్యికోట్లు రాబట్టే సినిమా అని ముందే కన్ఫామ్ చేస్తున్నారు. హనురాఘవపూడీ సినిమా కూడా వెయ్యికోట్లు రాబట్టే రేంజ్ ఉన్న మూవీనే అనంటున్నారు. కాని ఎటొచ్చి కన్నప్పకే అంత సీన్ లేదు. ఇందులో ప్రభాస్ స్పెషల్ రోల్ వేస్తున్నాడనే న్యూసే లేకపోతే, ఈ మూవీని పట్టించుకునే నాథుడే ఉండడు.. ఇది సినీ జనాల్లో ఉన్న అభిప్రాయం ఐతే సందీప్ రెడ్డి వంగ మేకింగ్ లో ప్రభాస్ చేసే సినిమా జూన్ లో మొదలయ్యే ఛాన్స్ ఉంది. అది కేవలం 6 నెలల్లో పూర్తై 2026 సమ్మర్ లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. సలార్ 2026 దసరా అంటున్నారు. అలా చూసినా ఈ ఏడాది రెండు సినిమాలు, వచ్చే ఏడాది రెండు మూవీలతో రెబల్ స్టార్ పక్కా ప్లానింగ్ తో ముందుకెళుతున్నాడని తేలింది.. మొత్తంగా ఎవరు పాన్ ఇండియాని షేక్ చేసినా చేయకున్నా, ప్రతీ ఏడాది మినిమన్ వెయ్యికోట్ల వసూళ్ల ను రెండుసార్లు, కంటెంట్ కలిసొస్తే తన రికార్డులను తానే బ్రేక్ చేసే ప్రయోగాలతో దూసుకెళ్లేలా ఉన్నాడు. [embed]https://www.youtube.com/watch?v=ZA_rC50Ujbg[/embed]