రెబల్ స్టార్ కు యాక్సిడెంట్, వణుకుతున్న హోంబలే, ఇప్పట్లో కష్టమే
రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఎప్పుడు ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో... ఏ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళతాడో అర్థం కాక రెబల్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఎప్పుడు ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో… ఏ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళతాడో అర్థం కాక రెబల్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఎనిమిది సినిమాలను రెబల్ స్టార్ లైన్ లో పెట్టాడు. ఈ సినిమాలన్నీ మూడేళ్లలో విడుదల చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆరు నెలలకు ఒక సినిమాను రిలీజ్ చేస్తానని ఫ్యాన్స్ కు ఇప్పటికే హామీ కూడా ఇచ్చాడు. ఆ హామీ ప్రకారం అనుకున్నది అనుకున్నట్టుగా వర్కౌట్ చేస్తున్నట్టు క్లియర్ గా అర్థమవుతుంది.
బాలీవుడ్ హీరోలను తొక్కడమే లక్ష్యంగా ఇప్పుడు రెబల్ స్టార్ వర్కౌట్ మొదలుపెట్టాడని, ఆ విషయంలో సక్సెస్ అవుతున్నాడని కూడా ఫాన్స్ ధీమాగా ఉన్నారు. ఇక ఇప్పుడు ప్రభాస్ సినిమా విడుదల అవుతుంది అంటే బాలీవుడ్ హీరోలకు చెమటలు పట్టి, నరాలు పగిలే పరిస్థితి వచ్చింది. ఒక సినిమా తర్వాత మరో సినిమాను వెంట వెంటనే షూటింగ్ ఫినిష్ చేస్తూ ఆ సినిమాలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదల చేస్తూ బాహుబలి సమయంలో వచ్చిన గ్యాప్ ను ఫిల్ చేయడానికి ప్రభాస్ నానా ప్రయత్నాలు చేస్తున్నాడు.
వచ్చేయేడాది మార్చిలో ప్రభాస్ నుంచి ఒక సినిమా రిలీజ్ కానుంది. అలాగే ఆగస్టు 15 తర్వాత ఒక సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. హోం బలే ఫిలిమ్స్ బ్యానర్ లో ప్రభాస్ నుంచి మూడు సినిమాలు రానున్నాయి. ప్రశాంత వర్మ డైరెక్షన్లో అలాగే లోకేష్ కనకరాజు డైరెక్షన్లో ఒక సినిమా చేసేందుకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు మేకర్స్. ఈ పీక్ టైం లో ప్రభాస్ ఫ్యాన్స్ ను బ్యాడ్ న్యూస్ ఇబ్బంది పెడుతోంది. ఒక సినిమా షూటింగ్ లో ప్రభాస్ గాయపడ్డాడని జపాన్ లో వచ్చే నెల మూడవ తారీఖున విడుదల అయ్యే కల్కి సినిమా ప్రమోషన్లకు హాజరు కావడంలేదని అధికారిక ప్రకటన వచ్చింది.
ఈ ప్రకటన మరెవరో చేయలేదు స్వయంగా ప్రభాస్ చేయడం గమనార్హం. ఓ సినిమా షూటింగ్ చిత్రీకరణ సమయంలో తన చీలమండ బెణికిందని అందుకే జపాన్ వెళ్లడం లేదని డిస్ట్రిబ్యూటర్లు అలాగే టీం ప్రమోషన్స్ లో పాల్గొంటుందని ప్రభాస్ ప్రకటించాడు. ఈ వార్త తెలియడంతో ప్రభాస్ ఫ్యాన్స్ పూజలు చేయడం మొదలుపెట్టారు. ఏది ఎలా ఉన్నా ఫుల్ స్వింగ్ లో ఉన్న ప్రభాస్ ఇప్పుడు గాయపడటం మాత్రం కచ్చితంగా నిర్మాతలకు షాక్ ఇచ్చే విషయమే. మరి ప్రభాస్ ఎప్పుడు కోలుకుంటాడో సినిమాలను తిరిగి ఎప్పుడు మొదలుపెడతాడు అని ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. అయితే గాయం తీవ్రతపై మాత్రం స్పష్టత లేదు ఒక యాక్షన్ సీన్ షూటింగ్ సమయంలో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు.