వార్ 2 కోసం రెబల్ స్టార్ ను వాడేస్తున్నారు.. రాజాసాబ్ హెల్ప్ కోసం వచ్చేశారు

బాహుబలి సినిమాల తర్వాత నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా అనగానే ఏ అప్డేట్ వచ్చినా సరే జనాలు ఇంట్రెస్టింగ్ గా చూడటం మొదలుపెట్టారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 4, 2025 | 10:50 AMLast Updated on: Feb 04, 2025 | 10:50 AM

Rebel Star Is Being Used For War 2 Rajasaab Came For Help

బాహుబలి సినిమాల తర్వాత నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా అనగానే ఏ అప్డేట్ వచ్చినా సరే జనాలు ఇంట్రెస్టింగ్ గా చూడటం మొదలుపెట్టారు. సినిమాకు సంబంధించి ప్రభాస్ కూడా అలాగే ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ గానే ప్లాన్ చేస్తున్నాడు. స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేయకుండా చిన్న డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. సలార్ సినిమా తర్వాత నుంచి ప్రభాస్ హిట్ ట్రాక్ లోకి అడుగుపెట్టడం ఆ తర్వాత నుంచి భారీ ప్రాజెక్టులకు సైన్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇక ప్రభాస్ సినిమాలు విషయంలో బాలీవుడ్ కూడా ఇప్పుడు కాస్త కంగారు పడుతోంది.

కల్కీ సినిమా తర్వాత నుంచి బాలీవుడ్లో కలవరం మొదలైంది. ఆ సినిమా ఆ రేంజ్ లో హిట్ అవుతుందని బాలీవుడ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక ప్రమోషన్స్ విషయంలో కూడా ఇప్పుడు ప్రభాస్ ను చూసి.. బాలీవుడ్ జనాల్లో భయం మొదలైంది. తమ సినిమాలకు తిరుగులేదు అనుకున్న టైంలో ప్రభాస్ వచ్చి బాలీవుడ్ కు చుక్కలు చూపించడం మొదలుపెట్టాడు. ఇక బాలీవుడ్ హీరోలు అయితే ఇప్పుడు ప్రభాస్ క్రేజ్ ను బాగానే వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమ సినిమాల ప్రమోషన్స్ కు ప్రభాస్ ను వాడుకోవడానికి రెడీ అవుతున్నారు.

అందులో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇప్పుడు ప్రభాస్ విషయంలో చాలా పాజిటివ్ గా కనబడుతున్నాడు. సౌత్ మార్కెట్ మీద ఇప్పటికే ఫోకస్ పెట్టిన హృతిక్ రోషన్ ఈ సినిమాలో విలన్ గా ఎన్టీఆర్ ను తీసుకున్నారు. ఇప్పుడు వార్ 2 ప్రమోషన్స్ కోసం ప్రభాస్ ను అప్రోచ్ అవుతున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ను అడ్డం పెట్టుకొని కన్నడ, తమిళంలో అలాగే తెలుగులో మార్కెట్ కొల్లగొట్టాలని ప్రయత్నం చేస్తున్న వార్ 2 ప్రొడ్యూసర్ ఇప్పుడు ప్రభాస్ ను కూడా వాడుకుని దుమ్మురేపాలని రెడీ అవుతున్నారు.

ఇందుకోసం హృతిక్ రోషన్ ను రంగంలోకి దింపుతున్నారు. ప్రభాస్ ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో చేస్తున్న ది రాజాసాబ్ సినిమాలో ఒక గెస్ట్ రోల్ చేయడానికి హృతిక్ రోషన్ రెడీ అయినట్లు సమాచారం. ఆ రోల్ చేయడం ద్వారా ప్రభాస్ తో ఫ్రెండ్షిప్ పెంచుకోవాలని రుతిక్ భావిస్తున్నాడట. ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో కూడా ప్రభాస్ తో ఫ్రెండ్షిప్ ఉపయోగపడుతుందని స్కెచ్ గీసినట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక వార్ 2 షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఆగస్టులో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈలోపే ది రాజా సాబ్ సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఇప్పటికే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన ఈ సినిమాలో త్వరలోనే కొన్ని సీన్స్ షూట్ చేయాల్సి ఉంది. ఒక గెస్ట్ రోల్ కోసం టాలీవుడ్ సీనియర్ హీరోని అనుకున్న డైరెక్టర్లు ఇందుకోసం బాలీవుడ్ హీరోలను కూడా అప్రోచ్ అయినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు హృతిక్ రోషన్ ఓకే చెప్పడంతో గెస్ట్ రోల్ కు అతన్ని తీసుకుంటున్నాడు డైరెక్టర్.