2000 కోట్లుకు.. 4 కండీషన్లు.. 65 రోజుల్లో అద్భుతాలు..
రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ సినిమా అంటేనే సెన్సేషన్ క్రియేట్ చేసే కాంబినేషన్ ఇది.. ఈ కాంబినేషన్ ఫిక్స్ అయ్యి ఏడాది కావస్తోంది.

రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ సినిమా అంటేనే సెన్సేషన్ క్రియేట్ చేసే కాంబినేషన్ ఇది.. ఈ కాంబినేషన్ ఫిక్స్ అయ్యి ఏడాది కావస్తోంది. కథ సిధ్ధమైంది…స్క్రీన్ ప్లే రెడీ అయ్యింది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా అయిపోయాయి. ఇక మిగిలింది షూటింగ్ షురూచేయటమే… కాని ప్రభాస్ చూస్తే ఫౌజీ ఫస్ట్ షెడ్యూల్ కే అతుక్కుపోయాడు. తర్వాత రాజ సాబ్ కోసం 50 రోజులు కేటాయించేందుకు రెడీ అయ్యాడు.. ఇలాంటి పరిస్థితుల్లో సందీప్ రెడ్డి వంగ బాంబు పేల్చాడు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా నాలుగు బాంబులు పేల్చాడు సందీప్ రెడ్డి వంగ. అసలు తనతో ప్రభాస్ సినిమా సెట్ అయ్యిందంటేనే, రెండు మూడు వేల కోట్ల వసూళ్లు ముందే కన్ఫామ్ చేసుకుంటున్నారు. అలాంటిది అంతా అనుకున్నట్టే జరిగి యానిమల్, అర్జున్ రెడ్డి రేంజ్ మూవీ పడితే, బాహుబలి, దంగల్ రికార్డులు బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ కాంబినేషన్ కి అంత సీన్ ఉంది. కాబట్టే కండీషన్లు పెడుతున్నాడు సందీప్ రెడ్డి. ఏకంగా నాలుగు కండీషన్స్ పెట్టాడట. ఏదో హిట్లొస్తున్నయని కాదు, ఔట్ పుట్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని చెప్పేందుకే ఈ కండీషన్స్ పెట్టాడట. మరి ఆ నాలుగు కండీషన్స్ ఏంటో చూసేయండి…
ప్రభాస్ తో సందీప్ రెడ్డి సినిమా తీయాలంటే ఖచ్చితంగా రెబల్ స్టార్ 4 కండీషన్లు ఫాలో అవ్వాలి… అందులో ఒకటి ఎట్టి పరిస్థితుల్లో స్పిరిట్ మూవీ షూటింగ్ జూన్ నుంచి మొదలవ్వాలి. అంతే ఆలోపే ఫౌజీ సినిమా షూటింగ్ పూర్తి చేయాలి.. అది ఇది ప్యార్ లల్ గా చేస్తానంటే కుదరదు. ఇది కూడా సందీప్ పెట్టిన కండీషన్ లో భాగమే…ఇక స్పిరిట్ మూవీ కోసం ప్రభాస్ 65 రోజుల కాల్ షీట్స్ కేవలం టాకీ పార్ట్ కే కేటాయించాలనేది సందీప్ రెండో డిమాండ్. అంతేకాదు ఇందులో ప్రభాస్ కోసం డూప్ ని వాడటం కుదరదని కూడా సందీప్ తేల్చాడు…
బేసిగ్గా రిస్కీ ఫైట్ల చేసేప్పుడు డూప్ లని బాడీ డబుల్ లని హీరోలు వాడటం కామన్. అందుకోసం లాంగ్ షాట్ లో వెనకనుంచి డూప్ లని చూపిస్తూ, అలా సినిమా తీయటం కామన్ గా జరుగుతుంటుంది. అదే స్పిరిట్ లో కుదరదని తేల్చాడు. అలాగని ప్రభాస్ ని రిస్క్ లో పెట్టే హెవీ సీన్లు లేకుండా జాగ్రత్త పడినట్టు కూడా తనకి తేల్చాడట.ఇక ఇది కాకుండా మరో రెండు కండీషన్స్ ఏంటంటే, సాంగ్స్ కి 35 రోజుల డేట్స్ ఇవ్వటం తోపాటు, ప్రమోషన్ కి 25 రోజులు కేటాయించాలంటున్నాడు.ఇక ఇప్పటి వరకు ప్రభాస్ సినిమాలన్నీ హిందీ, తమిళ్, మలయాళం, కన్నడలో వేరే వాళ్లు డబ్బింగ్ చెప్పారు. తెలుగు లో మాత్రంమే తన పాత్రకి తాను డబ్బింగ్ చెప్పుకున్నాడు రెబల్ స్టార్
కాని ఇక మీదట అది కుదరదట. ఎట్టిపరిస్థితుల్లో తెలుగు లానే, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ప్రభాస్ డబ్బింగ్ చెప్పాలని తేల్చాడట. ఒక్క మలయాళం డబ్బింగ్ మాత్రం తను చెప్పాల్సిన పనిలేదని తేల్చినట్టు తెలుస్తోంది. మలయాళం డబ్బింగ్ ఆ భాషమీద గట్టి పట్టున్న వాళ్లే తప్ప, డైలాగ్ ని విని చెప్పటం కుదరదు కాబట్టి, ఇలాంటి ఎగ్జెమ్షన్ ఇచ్చాడట.ప్రజెంట్ మీడియాలో 65 రోజుల కాల్ షీట్స్, జూన్ నుంచి షూటింగ్, నో డూప్ అన్న మూడు కండీషన్లు మాత్రమే వైరలయ్యాయి. మిగతా రెండు కండీషన్స్ మాత్రం ఎక్స్ క్లూజివ్ గా అందాయి… సో వాటిని బట్టి చూస్తే సందీప్ రెడ్డి వంగ తన సినిమా అంటే ఎంతగా ప్రేమిస్తాడో, ఎంత డీప్ గా పర్ఫెక్సన్ తో ఉంటాడో తెలుస్తోంది.