Adipurush: ఓటీటీలోకి ఆదిపురుష్.. డేట్ ఎప్పుడంటే..
ప్రభాస్ హీరోగా ఓం రౌత్ డైరెక్షన్‌లో వచ్చిన ఆదిపురుష్ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానుంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఆదిపురుష్ సినిమా థియేటర్స్‌లో అనుకున్న రిజల్ట్ ఇవ్వలేదు.

Rebel star Prabhas as the hero and Kritisanan as the heroine, the film directed by Om Raut, Adipurush, will be released on OTT in the second week of July
ప్రభాస్‌ను రాముడిగా ఆడియన్స్ యాక్సెప్ట్ చేసినా.. మిగిలిన క్యారెక్టర్స్ విషయంలో చాలా డిసప్పాయింట్ అయ్యారు. ముఖ్యంగా రావణుడు, హనుమంతుడి గెటప్ విషయంలో కథ విషయంలో చాలా మార్పులు ఉండటంపై విమర్శలు వచ్చాయి. సినిమా చూసిన ఆడియన్స్ బయటికి వచ్చి డైరెక్టర్ ఓంరౌత్‌ను అనరాని మాటలన్నీ అన్నారు. ఇక హిందూ సంఘం నేతలు ఏకంగా సినిమా మీద కేస్ వేశారు. ఎన్ని విమర్శలు ఎదుర్కున్నా సినిమాకు ఓపెనింగ్ కలెక్షన్స్ బాగానే వచ్చాయి.
అయితే రానురాను కలెక్షన్స్ భారీగా తగ్గిపోతున్నాయి. దీంతో సినిమాను వచ్చే వారం ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాను జులై లాస్ట్ వీక్ లేదా ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లో ఓటీటీలో రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ రాను రాను కలెక్షన్స్ తగ్గుతుండటంతో అనుకున్న డేట్ కంటే ముందే సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో డేట్ కూడా ప్రకటించే చాన్స్ ఉందని టాక్.