PRABHAS: రెబల్ స్టార్‌కి షష్టి పూర్తి కార్యక్రమం ప్లాన్ చేశారా..?

రెబల్ స్టార్‌కి షష్టి పూర్తి అన్న వార్త హాట్ టాపిక్ అయ్యింది. జనవరి 20న ప్రభా‌స్‌కి షష్టి పూర్తి కార్యక్రమం ప్లాన్ చేశారు. వింటానికి వింతగా ఉన్నా ఇదే జరగబోతోంది. డైరెక్టర్ మారుతి దయ వల్లే ఇలా జరగబోతోందని తెలుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 30, 2023 | 05:36 PMLast Updated on: Oct 30, 2023 | 5:36 PM

Rebel Star Prabhas Celebrates His Shashtipoorthi

PRABHAS: రెబల్ స్టార్ ప్రభాస్‌కి ఇంకా పెళ్ళి కాలేదు. వచ్చే ఏడాదే పెళ్లి అంటూ వస్తున్న గాసిప్స్‌కి బ్రేక్ పడటంలేదు. ఇంతలోనే రెబల్ స్టార్‌కి షష్టి పూర్తి అన్న వార్త హాట్ టాపిక్ అయ్యింది. జనవరి 20న ప్రభా‌స్‌కి షష్టి పూర్తి కార్యక్రమం ప్లాన్ చేశారు. వింటానికి వింతగా ఉన్నా ఇదే జరగబోతోంది. డైరెక్టర్ మారుతి దయ వల్లే ఇలా జరగబోతోందని తెలుస్తోంది.

మారుతి మేకింగ్‌లో ప్రభాస్ చేస్తున్న సినిమాలోనే ఈ సంఘటన జరగబోతోంది. తన దర్శకత్వంలో రెబల్ స్టార్ చేస్తున్న మూవీలో షష్టిపూర్తి సీన్ ఉందట. ఇందులో డ్యూయెల్ రోల్ వేస్తున్న ప్రభాస్ ఒక పాత్రలో తాతగా కనిపిస్తాడట. 60 ఏళ్లు నిండిన తాతకి కన్నుకొట్టే అలవాటు ఉంటుంది. తను ప్రేమలో పడటం అన్న కాన్సెప్ట్‌తో ఫన్ ట్రాక్ క్రియేట్ చేశాడట మారుతి. అందులో భాగంగా షష్టిపూర్తి కార్యక్రమం తాలూకు సీన్‌ని జనవరి 20న షూట్ చేయబోతున్నారు.

ప్రజెంట్ మోకాలి సర్జరీ తర్వాత ఫిజియో థెరపీ చేయించుకుంటున్న ప్రభాస్, నవంబర్ 10న సలార్ ట్రైలర్‌తో పాటు ఫ్యాన్స్‌ని కలవబోతున్నాడు. డిసెంబర్ వరకు రెస్ట్ తీసుకోనున్న ప్రభాస్ జనవరి 20 నుంచి మారుతి మూవీ సెట్లో సందడి చేయబోతున్నాడు. సో అలా ప్రభాస్ షష్టి పూర్తి మ్యాటర్ లీకైంది. హాట్ టాపిక్ అయ్యింది.