Prabhas: మళ్లీ అవతారమెత్తుతున్న ప్రభాస్.. ఫ్యాన్స్ కి ఇది కాస్త కష్టమే.?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ టీజర్ గురువారమే రాబోతోంది. దీంతో ఫ్యాన్స్ లో ఎక్కడ లేని సంతోషం కనిపిస్తోంది. కాని ఇంతలోనే ప్రభాస్ మళ్లీ దేవుడి అవతారమెత్తుతున్నాడని లీకైంది. అక్కడే ప్రభాస్ ఫ్యాన్స్ కంగారు పడాల్సి వస్తోంది. ఇంతకి అంతగా ఎందుకు కంగారుపడాలి..? మీరే చూడండి.

Rebel Star Prabhas is acting in Project K and there is talk in the movie circles that Kalki will be seen in an avatar
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ తీసిన సలార్ మూవీ టీజర్ గురువారం రాబోతోంది. 55 సెకన్ల నిడివితో ఈ టీజర్ ని కట్ చేసినట్టు తెలుస్తోంది. ఎప్పుడో ఆదిపురుష్ టైంలోనే రావాల్సిన టీజర్ ఇప్పడు వస్తుండటంతో ఫ్యాన్స్ కి ఎట్ లీస్ట్ ఇప్పుడైనా సంబురాలు జరుపుకుునే ఛాన్స్ చిక్కింది. ఇలాంటి టైంలో పిడుగు లాంటి వార్త ఫ్యాన్స్ ని కంగారు పెట్టే ఛాన్స్ ఉంది.
మరోసారి యంగ్ రెబల్ స్టార్ దేవుడి అవతారమెత్తబోతున్నాడట. ఇప్పటికే ఆదిపురుష్ లో రామావతారం ఎత్తితే ఓ వైపు వసూళ్ల వరదున్నా, కామెంట్లు, కోర్టు నుంచి నోటీసులు, ఫ్లాప్ అని తేల్చేసే లెక్కలతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. ఇలాంటి టైంలో మరో సారి ప్రభాస్ దేవుడి అవతారం ఎత్తితే ఏంటి పరిస్థితి అనుకోవాల్సి వస్తోంది.
ఆదిపురుష్ లో విష్ణు అవతారం అయిన రాముడిగా ప్రభాస్ కనిపిస్తే, రాధేశ్యామ్ లో ఆల్ మోస్ట్ కృష్ణుడి అంశగానే కనిపించాడు ప్రభాస్. కృష్ణుడి అవతారం ప్రేరణగానే ఆ కథ తెరకెక్కింది. కాని రెండూ కూడా ప్రభాస్ కి కలిసి రాలేదు. అలాంటిది విష్ణు దేవుడి తాలూకు మరో అవతారం అయిన కల్కీ పాత్రలో ప్రభాస్ అంటే ఫ్యాన్స్ మళ్లీ కంగారు పడాల్సి వస్తోంది. ప్రాజెక్ట్ కే లో కే అంటే కల్కీ అనే డౌట్ ఎప్పటి నుంచో ఉంది. అది ఇప్పుడు కన్ఫామ్ అయ్యింది. సో రాముడు, కృష్ణుడు, ఇలా రెండు అవతారాలు కలిసి రాని వేళ, కల్కీ అవతారం కలిసొస్తుందా అన్న భయాలు వెంటాడుతున్నాయి. నాగ్ అశ్విన్ మేకింగ్ ఓవైపు, ఔట్ పుట్ అదిరిందని కమల్ హాసన్ లాంటి వాల్ళు మెచ్చుకోవటం మరో వైపు.. ఇవన్నీ చూస్తే కనీసం ఈ మూడో అవతారమైనా బ్లాక్ బస్టర్ అవుతుందనే ఆశలు పెరుగుతున్నాయి. కాని పాత భయాలు అలానే ఉన్నాయి.