Prabhas: 40లక్షలకు విల్లా అద్దెకు తీసుకున్న ప్రభాస్.. అంత స్పెషాలిటీ ఏంటి ?
ఫ్రెండ్స్ తక్కువ మందే అయినా.. వాళ్లతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తుంటాడు ప్రభాస్. ప్యాన్ ఇండియా స్టార్‌గా బిజీగా మారినా.. ఫ్రెండ్స్‌కు ఇచ్చే ఆ స్పేస్‌ను మాత్రం మిస్ చేయడం లేదు. షూటింగ్స్ మధ్యలో కాస్త టైమ్ దొరికినా.. ఫ్రెండ్స్‌తో ట్రిప్పులు వేస్తుంటారు.

Rebel star Prabhas is enjoying his holiday in Italy and it is reported that he has rented a villa for 40 lakhs.
ఒక్కో సినిమా కి వంద కోట్ల పారితోషికం అందుకుంటున్నాడు ప్రభాస్. బాలీవుడ్‌లో ఖాన్ త్రయానికి ధీటుగా ప్యాకేజీ అందుకుంటున్న స్టార్ ప్రభాస్. వరుసగా భారీ ప్రాజెక్టు లతో క్షణం తీరిక లేనంత బిజీ షెడ్యూల్స్ ఉన్నాయ్. ఈ మధ్యే ఆదిపురుష్ విడుదలైంది. ఎన్ని విమర్శలు ఎదురైనా ఈ సినిమా 400 కోట్ల క్లబ్ వైపు దూసుకెళుతోంది. ఈ సోమ- మంగళవారాల వసూళ్లు డల్ అయినా.. వీకెండ్ లో తిరిగి పుంజుకుంటుందని భావిస్తున్నారు. ఈ సినిమా సుమారు 500కోట్లు పైగా వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ విశ్లేషిస్తోంది. తీరిక లేని ఈ షెడ్యూళ్ల నుంచి ప్రభాస్ కొంత విరామం కోరుకున్నారు.
డార్లింగ్ ప్రస్తుతం తన ఫేవరెట్ కంట్రీ ఇటలీలో సెలవులను ఆస్వాదిస్తున్నారు. దీని కోసం ఒక విల్లా అద్దెకు తీసుకున్నాడు. ఈ వెకేషన్ విల్లా కోసం ప్రభాస్ నెలకు 40 లక్షల భారీ మొత్తాన్ని చెల్లిస్తున్నాడు. షూటింగ్ విరామ సమయంలో రిలాక్స్ అయ్యేందుకు కొద్ది మంది సన్నిహితులతో మాత్రమే అక్కడికి వెళ్తాడు. ఆదిపురుష్ రిలీజ్ ముందు అతడు మోకాలి చికిత్స కోసం యూకే వెళ్లాడని ప్రచారమైంది. అతడు ఇటలీ వెళ్లాడని తాజాగా రివీలైంది. తర్వాత సలార్ లాంటి భారీ చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేయాల్సి ఉంది. దీంతో పాటు ప్రాజెక్ట్ – కే ని శరవేగంగా పూర్తి చేయడానికి అవసరమైన కాల్షీట్లను ప్రభాస్ కేటాయించాల్సి ఉంటుంది.