రెబల్ రొట్టెను లాక్కున్నారు… టీజర్ పండగలో 500 కోట్ల ట్విస్ట్…
ది రాజా సాబ్ టీజర్ కి రెండు వర్షన్స్ ని రెడీ చేసింది ఫిల్మ్ టీం. లీకులతో తేలిందేంటే, ఒకటి 80 సెకన్ల నిడివితో ఉంటే, మరో టీజర్ 90 సెకన్లతో రెడి అయ్యింది. రెండీంటికి రెబల్ స్టార్ ప్రభాస్ డబ్బింగ్ చెప్పాడని కూడా తెలుస్తోంది.
ది రాజా సాబ్ టీజర్ కి రెండు వర్షన్స్ ని రెడీ చేసింది ఫిల్మ్ టీం. లీకులతో తేలిందేంటే, ఒకటి 80 సెకన్ల నిడివితో ఉంటే, మరో టీజర్ 90 సెకన్లతో రెడి అయ్యింది. రెండీంటికి రెబల్ స్టార్ ప్రభాస్ డబ్బింగ్ చెప్పాడని కూడా తెలుస్తోంది. అలానే క్రిస్మస్ స్పెషల్ గా ఈ నెల 25న టీజర్ ని లాంచ్ చేసేందుకు సర్వం సిద్దమైంది. కట్ చేస్తే, సీన్ రివర్స్… వన్ వీక్ లోనే ప్లానింగ్స్ అన్నీ మారిపోయాయి… ఈనెల 25న రిలీజ్ చేయాలనుకున్న టీజర్ ని వచ్చేనెలకి వాయిదా వేస్తున్నారట… ఇయర్ ఎండ్ కాదు, న్యూ ఇయర్ స్పెషల్ గా కూడా ఎలాంటి టీజర్లు ఉండకపోవచ్చని తెలుస్తోంది. కాని జనవరి 14, జనవరి 26, ఫిబ్రవరి 14 డేట్లు మాత్రం ఫిల్మ్ టీం లాక్ చేసింది. అసలు రావాల్సిన టీజర్ ఎందుకు రావట్లేదు…? మూడు ముహుర్తాలను ది రాజా సాబ్ టీం ఎందుకు వదలట్లేదు..?
రెబల్ స్టార్ ప్రభాస్ యాంకిల్ యాక్సిడెంట్ నుంచి కోలుకుంటున్నాడు. రెండు వారాల రెస్ట్ తర్వాత మళ్లీ ది రాజా సాబ్ షూటింగ్ ని పూర్తి చేసేందుకు రంగంలో దిగబోతున్నాడు. అంతవరకు బానే ఉంది. ఆతర్వాత సంగతే తేలట్లేదు..అదే ది రాజా సాబ్ టీజర్. వచ్చే వారం అంటే ఈనెల 25న ది రాజా సాబ్ టీజర్ రిలీజ్ అన్నారు
అందుకోసం రెండు వర్షన్స్ తో టీజర్లు కట్ చేశారు. ఒకటి 80సెకన్లు, మరొకటి 90 సెకన్లు అంటే నిమిషమున్నర డ్యూరేషన్ తో టీజర్ లు రెడీ. వాటికి ప్రభాస్ కూడా డబ్ చెప్పడం, ఫైనల్ కట్ పూర్తవ్వటం జరిగిపోయింది. ఇక రిలీజ్ చేయటమే తరువాయి భాగం. కాని సడన్ గా లెక్కలన్నీ మారాయి.. టీజర్ రిలీజ్ ని వాయిదా వేసేందుకే ఫిల్మ్ టీం రెడీ అయ్యింది
అసలు రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డేకే టీజర్ అన్నారు. కాని చిన్న వీడియో క్లిప్ తో సరిపెట్టారు. కనీసం క్రిస్మస్ స్పెషల్ గా టీజర్ వస్తుందని ఫ్యాన్స్ అనుకుంటే, అది కూడా జరిగేలా లేదు. కారణం ఏప్రిల్ 10కి రిలీజ్ అనుకున్న ది రాజా సాబ్ విడుదల తేదీ మారేలా ఉంది. యాంకిల్ సర్జరీ తర్వాత రెస్ట్ తీసుకోవాల్సి రావటంతో, ప్రభాస్ వచ్చే ఏడాది సంక్రాంతి వరకు సెట్లో అడుగుపెట్టే ఛాన్స్ లేదు.
కాబట్టి ఈ షూటింగ్ వాయిదా వల్ల, ఏప్రిల్ 10కి సినిమా రిలీజ్ చేయటం కష్టమయ్యేలా ఉందట. కాబట్టే ప్లాన్ బీ ని రెడీ చేశారు. మే ఎండ్ కి సినిమాను వాయిదా వేయాలనుకుంటున్నారు. అలాంటప్పుడు ముందుగానే టీజర్ లాంచ్ చేయటం ఎందుకని ఆ ఆలోచనని వాయిదా వేస్తున్నారు
ఐతే జనవరి 14 కి పొంగల్ స్పెషల్ గా ది రాజా సాబ్ సాంగ్ ని మాత్రం రిలీజ్ చేయటం మాత్రం కన్ఫామ్ అయ్యింది. జనవరి 26 స్పెషల్ గా ఓ స్పెషల్ సాంగ్ ప్రోమోని వదలబోతున్నారు. ఫిబ్రవరి 14న మాత్రం ది రాజా సాబ్ టీజర్ వచ్చే అవకాశాలున్నాయి. ప్రేమికుల రోజు టీజర్ ని వదలటం వెనక ఇది రొమాంటిక్ రివేంజ్ హర్రర్ డ్రామా అని ఊహించుకోవాల్సి వస్తోంది. ఏదేమైనా డిసెంబర్ లో ఒక డేట్ కి వచ్చే అప్ డేట్ మిస్ అయినా, జనవరిలో రెండు, ఫిబ్రవరిలో మూడో అప్ డేట్ ని మాత్రం ఫిల్మ్ టీం రెడీ చేస్తోంది.