mumbai to amravati : ముంబై టూ అమరావతి
రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి‘ విడుదలకు సరిగ్గా పది రోజుల సమయం ఉంది. ఈనేపథ్యంలో ప్రమోషన్స్ లో స్పీడు పెంచబోతున్నారు మేకర్స్. ప్రచార చిత్రాల వరకూ వస్తే.. ఇప్పటికే ట్రైలర్, ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు.

Rebel Star Prabhas' 'Kalki' release is exactly ten days away.
రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి‘ విడుదలకు సరిగ్గా పది రోజుల సమయం ఉంది. ఈనేపథ్యంలో ప్రమోషన్స్ లో స్పీడు పెంచబోతున్నారు మేకర్స్. ప్రచార చిత్రాల వరకూ వస్తే.. ఇప్పటికే ట్రైలర్, ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ఇంకా.. ఈ సినిమాలో మరో మూడు పాటలుంటాయట. త్వరలోనే.. ఒక్కొక్కటిగా ఆ పాటలను విడుదల చేయనున్నారట.
ముంబైలో ‘కల్కి‘ కోసం ఈవెంట్ ప్లాన్ చేశారట. హీరో ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ లతో పాటు.. ఈ సినిమాలో నటించిన బాలీవుడ్ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొనె, దిశా పటాని ముంబై ఈవెంట్ లో సందడి చేయనున్నట్టు తెలుస్తోంది. ముంబై తర్వాత అమరావతిలో పెద్ద ఈవెంట్ ను ప్లాన్ చేస్తుందట టీమ్.
అమరావతి వేదికగా జరిగే ‘కల్కి‘ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో ఈ చిత్రంలో నటించిన ప్రభాస్, అమితాబ్, కమల్ ఎలాగూ పాల్గొంటారు. అయితే.. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథులుగా హాజరుకాబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. త్వరలోనే.. ‘కల్కి‘ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై అధికారిక ప్రకటన ఇవ్వనుందట నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్.