Salaar: పొద్దు పొద్దున్నే టీజర్.. ఆ ముహుర్తానికి కారణం పెద్దదే..
సలార్ మూవీ టీజర్ గురువారం ఉదయం 5 గంటలకి అన్నారు బానే ఉంది. ఏ మూవీ ప్రోమో ఆటైంకి రిలీజ్ చేయలేదు. కాని విచిత్రంగా ఈ టీజరు అప్పుడే ఎందుకు రిలీజ్ చేస్తున్నారు..దానికి కారణం కూడా విచిత్రంగానే ఉంది.. అదేంటో చూసేయండి..
సలార్ టీజర్ ఉదయం 5 గంటల 12 నిమిషాలకు రిలీజ్ అన్నప్పుడే అంతా ఆశ్చర్యపోయారు. ఏంటిది? సాయంత్రం కాదు, రాత్రి కాదు, కనీసం ఉదయం తోమ్మిదో పదిగంటలకో కాదు, కోడి కూసే వేళ టీజర్ లాంచ్ ఏంటా అని అంతా షాక్ అయ్యారు. దానికి కారణం మాత్రం విచిత్రంగానే ఉందిసలార్ టీజర్ మరీ ఉదయం 5 గంటలకు ప్లాన్ చేయటానికి బలమైన రీజనుంది. అంతా అనుకున్నట్టు ఇదేదో సెంటిమెంట్ పరంగా ముహూర్త బలం వల్లే ఇలా పెట్టలేదట. యూఎస్ ఆడియన్స్ కోసమే ఇలా ప్లాన్ చేశారని తెలుస్తోంది.
యూఎస్లో 50 లక్షలకు పైగా ఇండియా మూలాలున్న ఎన్నారైలున్నారు. అన్ని భాషలకు చెందిన వాళ్ల కోసం అక్కడ సలార్ ని ఏకంగా 2000 స్క్రీన్స్ లో రిలీజ్ చేయబోతున్నారట. అంటే కేవలం యూఎస్ నుంచే ఓపెనింగ్స్ 100కోట్ల పైనే ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అదే జరిగితే రికార్డే.. అందుకే సలార్ ప్రమోషన్ ని యూఎస్ మార్కెట్ ని టార్గెట్ చేస్తూ చేస్తున్నారు. మనకు ఇక్కడ ఉదయం అంటే అమెరికాలో సాయత్రంమే.. అప్పడే ఆఫీస్ పని ముగించుకునే ఎన్నారైలకు తీపికబురు ఇచ్చి, అలా అక్కడ ప్రమోషన్ లో ఎమోషన్ పెంచే ప్రయత్నం చేస్తోంది ఫిల్మ్ టీం.
వాళ్లకోసం ఆ టైంలో రిలీజ్ చేస్తే చూసేస్తారా అంటే, ఒకవైపు, ప్రభాస్ మరో వైపు ప్రశాంత్ నీల్, అంతకుమించి ఎన్నారైలనే టార్గెట్ చేస్తూ ప్రమోషన్ చేయటం ఇవన్నీ సలార్ కి కలిసొచ్చేలా చేస్తాయనేది ప్రశాంత్ నీల్ ప్లానింగ్ అని తెలుస్తోంది. ఇక్కడ ఏటైం కి టీజర్ వదిలినా జనం చూస్తారు.. కాబట్టి ఒకే దెబ్బకి రెండు పిట్టల ఫార్ములాతో సలార్ టీం అలా ఆ ముహుర్తంతో స్కెచ్చే మార్చేసింది.