రెబల్ స్టారే రాజు, సినిమాటిక్ యూనివర్స్ లో అరవ డైరెక్టర్ ప్లాన్ అదే

తమిళంలో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అనగానే అన్ని భాషల జనాల్లో ఒక రకమైన ఇంట్రెస్ట్ క్రియేట్ అయిపోతుంది. ఆ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఏ సినిమా వచ్చిన సరే జనాలు ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 24, 2025 | 07:55 PMLast Updated on: Jan 24, 2025 | 7:55 PM

Rebel Star Raju The Sixth Director In The Cinematic Universe Has The Same Plan

తమిళంలో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అనగానే అన్ని భాషల జనాల్లో ఒక రకమైన ఇంట్రెస్ట్ క్రియేట్ అయిపోతుంది. ఆ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఏ సినిమా వచ్చిన సరే జనాలు ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. ఇప్పుడు రజనీకాంత్ హీరోగా వస్తున్న కూలి సినిమాలో కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ పార్ట్ అనే టాక్ వినబడుతుంది. అయితే ఇప్పుడు లోకేష్ కనగారాజ్ తన సినిమాటిక్ యూనివర్స్ లో తెలుగు హీరోని కూడా తీసుకోవాలని ముందు నుంచి ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

అయితే ఎవరిని తీసుకుంటాడు అనేదానిపై మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ ప్రభాస్ విషయంలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ప్రభాస్ రోల్ ఎలా డిజైన్ చేయాలి అనే దానిపై ఇప్పటి నుంచే వర్క్ కూడా మొదలుపెట్టాడు. రీసెంట్ గా లోకేష్… ప్రభాస్ లుక్ ను రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని.. ఒక వీడియో మేకింగ్ కూడా జరిగిందని వార్తలు వచ్చాయి. సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ డిలే జరుగుతోంది. త్వరలోనే దీనికి సంబంధించి లుక్ రిలీజ్ అయ్యే ఛాన్స్ లు ఎక్కువగా కనబడుతున్నాయి.

అయితే ఈ సినిమాటిక్ యూనివర్స్ లో కమలహాసన్ తో పాటుగా ప్రభాస్.. హైలెట్ అవుతారని టాక్ వినపడుతోంది. ముందు.. ఖైదీ సినిమాలో కార్తీ, తర్వాత విక్రమ్ సినిమాలో కమల్ హాసన్…ను హైలెట్ చేశాడు లోకేష్. ఇప్పుడు ప్రభాస్ కోసం సపరేట్ గా ఒక ప్రాజెక్ట్ చేసి ఆ తర్వాత లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఫైనల్ మూవీ ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఆ సినిమాలో లీడ్ రోల్స్ ప్రభాస్, కమల్ హాసన్ అని టాక్. ప్రభాస్ కు ఉన్న ఇమేజ్ను దృష్టిలో పెట్టుకున్న లోకేష్.. రెబల్ స్టార్ అయితే పాన్ ఇండియా లెవెల్ లో వర్కౌట్ అవుతుందని ప్లాన్ చేస్తున్నాడు.

అందుకే ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా వర్కౌట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కూలీ సినిమా విషయంలో రజనీకాంత్ ను కూడా సినిమాటిక్ యూనివర్స్ కోసం ఒప్పించాడు. అందుకే ప్రభాస్ కోసం సపరేట్ గా ఒక ప్రాజెక్టు లాంచ్ చేసి ఆ తర్వాత సినిమాటిక్ యూనివర్స్ లో ఫైనల్ సినిమాను 2028 లేదా 29లో తీసుకురావాలని లోకేష్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ సిరీస్ లో త్వరలోనే ఖైదీ సీక్వెల్ కూడా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఖైదీ సీక్వెల్ కంటే ముందు ప్రభాస్ తో ఒక ప్రాజెక్టు ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఏ సినిమా చేసిన ఆరు నెలల్లో కంప్లీట్ చేసే లోకేష్ మరి ప్రభాస్ తో సినిమాను ఎన్నాళ్లలో కంప్లీట్ చేస్తాడో చూడాలి.