రెబల్ స్టార్ రిలాక్స్… రెబల్ ఫ్యాన్స్ కి ఊహించని షాక్..
రెబల్ స్టార్ ప్రభాస్ ట్విస్ట్ ఇచ్చాడు. తన ఫ్యాన్స్ కి ఊహించని షాక్ ఇచ్చేసినట్టే కనిపిస్తున్నాడు. మొన్నటి వరకు రూమర్ అనుకున్నది, ఇప్పుడు నిజమయ్యేలా ఉంది.

రెబల్ స్టార్ ప్రభాస్ ట్విస్ట్ ఇచ్చాడు. తన ఫ్యాన్స్ కి ఊహించని షాక్ ఇచ్చేసినట్టే కనిపిస్తున్నాడు. మొన్నటి వరకు రూమర్ అనుకున్నది, ఇప్పుడు నిజమయ్యేలా ఉంది. తన మోకాలి చికిత్స లో భాగంగా రాజా సాబ్ షూటింగ్ కి బ్రేక్ వేసిన ప్రభాస్, మళ్లీ సెట్లో అడుగుపెట్టేందుకు టైం పడుతుందనుకుంటే, ఫౌజీ సెట్లో కనిపించి ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చాడు. ఇప్పుడు రాజా సాబ్ ని పూర్తిగా పక్కన పెట్టి ఊహించని ఝలక్ ఇచ్చేలా ఉన్నాడు. ఔను కేవలం 10శాతం టాకీ పార్ట్ షూటింగ్ మాత్రమే పెండింది. అదయ్యాక 4 పాటల షూటింగ్ పూర్తి చేస్తే రాజా సాబ్ రెడీ ఫర్ రిలీజ్. కాని ప్రస్థుతానికి మారుతీని పూర్తిగా హోల్డ్ లో ఉండమని తేల్చేశాడు. కారణం సందీప్ రెడ్డి వంగనే… నిన్నటి వరకు సందీప్ రెడ్డి వంగ పెట్టిన కండీషన్స్ వల్లే ఫౌజీ, రాజా సాబ్ త్వరగా పూర్తవ్వబోతున్నాయన్నారు. కల్కీ2, సలార్ 2 కూడా వేగంగా పట్టాలెక్కబోతున్నాయన్నారు. ఇవన్నీ నిజంగానే జరిగేలా ఉన్నాయి. కాని ఎటొచ్చి రాజా సాబ్ కే పంచ్ పడేలా ఉంది. అదెలానో చూసేయండి.
రెబల్ స్టార్ ఫౌజీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తైంది. కాకపోతే దాంతర్వాత ది రాజా సాబ్ పెండింగ్ ప్యాచ్ వర్క్ పూర్తి చేయాలి.. కాని చేయటం కుదరట్లేదు. ఒక వేల కుదిరినా, పాటల షూటింగ్ మాత్రం పెండింగ్ పెట్టే ఛాన్స్ఉంది.అంటే ప్రజెంట్ ఫౌజీ ని ఎట్టి పరిస్థితుల్లో జూన్ లోగా పూర్తి చేయాలని ప్రభాస్ ఫిక్స్ అయ్యాడు. ఎందుకంటే జూన్ ఎండ్ నుంచి సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మొదలౌతుంది. తను పెట్టిన కండీషన్ వల్ల, తనకిచ్చిన ప్రామిస్ ని నిలబెట్టుకోవాలంటే, ఫౌజీ షూటింగ్ ని మెరుపు వేగం తో పూర్తి చేయాలి.
అలా చేయటానికి హను రాఘవ పూడీ సిద్ధం కాబట్టే, ప్రభాస్ పనికట్టుకుని పూర్తిగా ఫౌజీ మీదే ఫోకస్ పెంచాడు. ఐతే ది రాజా సాబ్ పెండింగ్ టాకీ పార్ట్ ని 10రోజుల్లో పూర్తిచేసి, ఇక ఈ సినిమా తాలూకు పెండింగ్ 4 సాంగ్స్ ని స్పిరిట్ సగం షూటింగ్ పూర్తయ్యాక లేదంటే ఈ ఏడాది ఎండింగ్ లో పూర్తి చేయాలనుకుంటున్నాడట.ఈలోపు రాజా సాబ్ టాకీ పార్ట్ సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తవుతుంది. ఇదంత ఓకే కాని, ఏప్రిల్ 10 నుంచి మేలేదా జూన్ కి ఈ సినిమా రిలీజ్ వాయిదా అని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. దాని సంగతేంటనే ప్రశ్న ఇప్పు ఎదురౌతోంది.
ఐతే దసరా, దీపావళి, క్రిస్మస్ ఇలా ఏ పండక్కి ది రాజా సాబ్ వచ్చే ఛాన్స్ లేదట. స్ట్రేయిట్ గా సంక్రాంతికే రాజా సాబ్ ని రంగంలో కి దింపే ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్పిరిట్ నిజూన్ లో మొదలు పెట్టాలంటే ఆలోపు ఫౌజీ ని పూర్తి చేయాలి. అది జరగాలంటే అడ్డుగా ఉన్న ది రాజా సాబ్ పాటల షూటింగ్ని వాయిదా వేయాలి…అందుకే సమ్మర్ కి రావాల్సిన రాజా సాబ్ సంక్రాంతికి సీన్ లోకొచ్చేలా ఉన్నాడు. ఎలాగూ ఎన్టీఆర్ మూవీ డ్రాగన్ సంక్రాంతికి కాకుండా సమ్మర్ కే వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టే రాజా సాబ్ పొంగల్ పోరుకి సిద్దపడ్డాడట.