రెబల్ స్టార్, సూపర్ స్టార్ తప్పించుకున్నారు.. జస్ట్ మిస్…
రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ ఇద్దరు ఈ నాలుగేళ్లలోనే కాదు, మొత్తం పదేళ్లలో రెండు సార్లు పెద్ద గండం నుంచి తప్పించుకున్నారని ఎంతమందికి తెలుసు... ఈవిషయం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ గేమ్ ఛేంజర్ వల్లే బయట పడింది.
రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ ఇద్దరు ఈ నాలుగేళ్లలోనే కాదు, మొత్తం పదేళ్లలో రెండు సార్లు పెద్ద గండం నుంచి తప్పించుకున్నారని ఎంతమందికి తెలుసు… ఈవిషయం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ గేమ్ ఛేంజర్ వల్లే బయట పడింది. శంకర్ ఇచ్చిన స్పీచే ఇప్పుడు రెబల్ స్టార్ ఫ్యాన్స్, సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో కొన్ని భయాలు పోయేలా చేసింది… ఫ్యాన్స్ లో చాలా వరకు పూనకాలకు కారణమైంది. శంకర్ రివీల్ చేసిన 15 ఏళ్ల జర్నీ స్టోరీతో చాలా వరకు రెబల్ ఫ్యాన్స్, సూపర్ స్టార్ ఫ్యాన్స్ రిలాక్స్ అయ్యారు. ఒకవేల డైరెక్టర్ శంకర్ చెప్పినట్టే జరిగితే పరిస్తితి ఎలా ఉండేదో అన్న ఆలోచనే ఫ్యాన్స్ ని కంగారు పెట్టిస్తోంది. ఇంతకి శంకర్ చెప్పిన మాట, ఎందుకు రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి, సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి తూటాలా మారింది. ఎందుకు అంతగా కంగారు పెట్టింది.. అంతలా తనేమన్నాడు..?
రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేశ్ బాబు 15 ఏళ్లలో రెండు సార్లో, లేదంటే మూడు సార్లో చాలా గండాలనుంచి బయట పడ్డారా? గత నాలుగేళ్లలో ఇలాంటి గండాలు ఈ ఇద్దరు హీరోలకే ఎక్కువయ్యాయా? వాటినుంచి తప్పించుకోవటానికి కారనం వాల్లు కొన్ని కథలను రిజెక్ట్ చేయటమేనా? ఈ డౌట్లన్ని రావటానికి కారనం తమిళ స్టార్ డైరెక్టర్ శంకరే
తన డైరెక్షన్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ చేశాడు. ఎప్పడో రావాల్సిన ఈ సినిమా వాయిదాలు పడుతూ, మొత్తానికి సంక్రాంతికి వస్తోంది. ఆల్రెడీ అమెరికాలో ఈవెంట్ తో ప్రమోషన్ లోఎమోషన్ పెంచింది ఫిల్మ్ టీం.కాని భారతీయుడు 2 లాంటి ఫ్లాప్ పడ్డాక శంకర్ డైరెక్షన్ మీద చాలా మందికి డౌట్లు పెరిగాయి…కాబట్టే గేమ్ ఛేంజర్ రిజల్ట్ ని కూడా ముందే ఫ్లాప్ అనేంతగా, చాలా మంది ఫిక్స్ అయ్యారనే నెగెటీవ్ ప్రచారం కూడా జరుగుతోంది.
ఇక రెబల్ స్టార్ ప్రభాస్ విషయానికొస్తే, గత నాలుగేళ్లలో రెండు సార్లు ప్రభాస్ ని కలిసి కథ వినిపించాడట డైరెక్టర్ శంకర్. కాని ఆ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ కాలేదు. కాని అదే మంచిదైందనే మాటే కామెంట్ల రూపంలో వినిపిస్తోంది. లేదంటే రెబల్ స్టార్ కెరీర్ లో మరో ఐ, మరో భారతీయుడు2 లాంటి ప్లాప్ పడి ఉండేదనే కౌంటర్లే పెరిగిపోయాయి. అంతేకాదు గత 15 ఏళ్లుగా తెలుగు హీరోలతో సినిమా చేయాలనుకుంటున్నా, ఏ ప్రాజెక్ట్ కూడా ఫైనలైజ్ కాలేదని బాధపడ్డాడు శంకర్. చిరుతో ఓ కథ అనుకుంటే కుదర్లేదన్నాడు. మహేశ్ బాబుకి కూడా రెండు సార్లు కథలు చెప్పాడట…
ఇలా తెలుగుహీరోలతో ఎందుకు సినిమాలు చేయలేదనే ప్రశ్నకు సమాధానంగా శంకర్ ఇలాంటి స్పీచ్ ఇచ్చాడని అంటున్నారు. ఐతే నిజంగానే శంకర్ కెరీర్ ని 15 ఏళ్లు రివైండ్ చేస్తే, కరెక్ట్ గా తనకి ఫ్లాపులు మొదలైంది కూడా 2010 తర్వాతే….
రోబో మూవీ 2010 లో రిలీజై హిట్ అయ్యింది. తర్వాతే శంకర్ కి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది.తన ఆస్తాన రైటర్ సుజాత మరణం తర్వాత తనకి కథల కొరతొచ్చింది. అలా త్రీఇడియట్స్ తమిళ్ రీమేక్ చేస్తే అది ప్లాప్ అయ్యింది. తర్వత ఐ తో పంచ్ పడింది. ఆతర్వతొచ్చిన రోబో 2.0 డిజాస్టరైతే, భారతీయుడు 2 అంతకుమించిన ఫ్లాప్ అని తేలింది. ఎలా చూస్తే గత పదిహేనేళ్లలో తనఎకౌంట్లో అన్నీ డిజాస్టర్లే… సో ఈ పదిహేనేల్లలో ప్రభాస్, మహేశ్, చిరు అండ్ కోతో శంకర్ సినిమాలు సెట్ కాకపోవటమే మంచిదైంది… అలా రెబల్ స్టార్, సూపర్ స్టార్ అండ్ కోకి కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లు కొద్దిలో మిస్ అయ్యాయని కూడా అంటున్నారు. మరి గ్లోబల్ స్టార్ ఈ గండం నుంచి ఎలా తప్పించుకుంటాడో అని యాంటీ ఫ్యాన్స్ కౌంటర్లు కూడా పెంచారు.