Kamal Prabhas : కమల్ హాసన్ కి రెబల్ స్టార్ వార్నింగ్
ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 AD' సినిమాలో కమల్ హాసన్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 AD’ సినిమాలో కమల్ హాసన్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ పెదనాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజు అప్పట్లో కమల్ హాసన్ కి వార్నింగ్ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా కమల్ రివీల్ చేశారు.
కృష్ణంరాజు హీరోగా నటించిన ఓ సినిమాకి కమల్ హాసన్ డ్యాన్స్ అసిస్టెంట్ గా పని చేశారు. అయితే ఆ సమయంలో కష్టమైన స్టెప్పు ఇవ్వొద్దని కమల్ కి కృష్ణంరాజు చెప్పేవారట. అంతేకాదు, ఓ సారి కష్టమైన స్టెప్స్ ఇస్తే నీ సంగతి చూస్తా అంటూ సరదాగా వార్నింగ్ కూడా ఇచ్చారట. ఈ విషయాన్ని ‘కల్కి’ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కమల్ చేసుకున్నారు.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మించిన ‘కల్కి’లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే తదితరులు నటించారు. ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.