Indra Re Release : ‘ఇంద్ర’ రీ-రిలీజ్
ఈ మధ్య టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ ఓ రేంజ్‌లో నడుస్తోంది. స్టార్ హీరోల హిట్ బొమ్మలు ఏదో ఒక అకేషన్‌కు రీ రిలీజ్ అయి ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాయి.

ఈ మధ్య టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ ఓ రేంజ్‌లో నడుస్తోంది. స్టార్ హీరోల హిట్ బొమ్మలు ఏదో ఒక అకేషన్‌కు రీ రిలీజ్ అయి ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే పోకిరి, జల్సా, సింహాద్రి లాంటి సినిమాలు రీ రిలీజ్ కలెక్షన్స్‌తో అదరగొట్టాయి. అలాగే చరణ్ ఫ్లాప్ సినిమా ఆరెంజ్ కూడా సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకోవడంతో పాటురీ రిలీజ్‌తో దుమ్ముదులిపేసింది ఆరెంజ్. తాజాగా మరో సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది.
మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో ఓ బ్రాండ్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రజెంట్ విశ్వంభర తో బిజీగా ఉండగా… ఈ సినిమా నుంచి బిగ్ సర్ ప్రైజ్ రెడీ అవుతోంది. చిరు బర్త్ డే కానుకగా టీజర్ వచ్చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇదిలాఉండే ఫ్యాన్స్ కు మరో అదిరిపోయేట్రీట్ రెడీ అవుతున్నట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్ లో న్యూస్ చక్కర్లు కొడుతోంది. చిరు బర్త్ డే కానుకగాబ్లాక్ బస్టర్ మూవీని రీరిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
చిరంజీవిబి. గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ‘ఇంద్ర’ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో చిరంజీవి కోర మీసంతో వైట్ అండ్ వైట్ ఫ్యాక్షనిస్ట్ ఇంద్రసేనా రెడ్డి పాత్రలో అదరగొట్టాడు. మొక్కే కదా అని పీకేస్తే.. పీక కోస్తా అనే డైలాగ్ ఫేమస్ అయింది. కాశీ, రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. 2002, జూలై 24న విడుదలైన రిలీజైనఈ మూవీ రిసెంట్ గా 22 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా.. ‘ఇంద్ర’ సినిమాని మళ్లీ రీ-రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించింది వైజయంతీ సంస్థ. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు కానుకగా ‘ఇంద్ర’ చిత్రాన్ని మళ్లీ థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.