HHMMMMMM.. నాగార్జున సూస్కోబడ్లా
సినిమా హీరోలంటే బయట ఫ్యాన్స్‌కు ఎంత అభిమానం ఉంటుందో అందరికీ తెలుసు. హరోలు బయట కనిపిస్తే చాలు.. అదేదో దేవున్ని చూసినట్టు ఎగబడతారు.

Recently, while Nagarjuna was coming from a vacation, a fan tried to approach Nagarjuna.
సినిమా హీరోలంటే బయట ఫ్యాన్స్‌కు ఎంత అభిమానం ఉంటుందో అందరికీ తెలుసు. హరోలు బయట కనిపిస్తే చాలు.. అదేదో దేవున్ని చూసినట్టు ఎగబడతారు. ఒక్క ఫొటో దొరికినా చాలు అని విశ్వప్రయత్నాలు చేస్తారు. అది వాళ్ల అభిమానమే కాని హీరోలను ఇబ్బంది పెట్టాలని ఇంటెన్షన్ కాదు. కానీ ఇదే విషయం తెలియక ఇప్పుడు నెటిజన్లతో మాటలు పడుతున్నారు హీరో నాగార్జున.
రీసెంట్‌గా నాగార్జున ఓ వెకేషన్ నుంచి వస్తున్న సమయంలో ఓ అభిమాని నాగార్జున దగ్గరికి వచ్చేందుకు ట్రై చేశాడు. కానీ నాగార్జున బౌన్సర్స్ మాత్రం ఆ అభిమానిని అడ్డుకున్నారు. అక్కడితో ఆగితే బాగుండేది. కానీ నాగార్జున బౌన్సర్‌లో ఒకరు ఆ అభిమాని మీద చెయ్‌చేసుకున్నాడు. అది చూసి నాగార్జున వాళ్లను అడ్డుకోలేదు. ఏం చూడనట్టు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందంతా వీడియో తీసిన ఓ వ్యక్తి దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
దీంతో ఈ వ్యవహారం కాస్త వైరల్‌గా మారింది. ఫ్యాన్స్ అంటే ఎందుకు ఇంత చిన్నచూపి అని నెటిజన్లు అంతా నాగార్జునను వేసుకోవడం మొదలు పెట్టారు. దీంతో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు నాగార్జున. అసలు ఆ సమయంలో ఏం జరిగిందో చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. కానీ జరగాల్సిన కార్యం జరిగిపోయిన తరువాత ఎవరు ఏం చెప్పినా పెద్దగా యూజ్ ఉండదు కదా.. ఇప్పుడు నాగార్జున సిచ్యువేషన్ కూడా అదే. క్లారిటీ ఇచ్చినా నెటిజెన్ల కామెంట్స్ మాత్రం ఆగడంలేదు.