అమెరికాలో 2.9 మిలియన్,82K టికెట్లు 2,488, ఇండియన్ సినిమాకు కొత్త టార్గెట్ ఫిక్స్

ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తే ఏముందిరా...? హాలీవుడ్ లో షేక్ చేస్తేనే మన దమ్ము ఏంటో తెలుస్తుంది. ఇది పక్కాగా ఫాలో అవుతున్నాడు దేవర. దీనెమ్మ సినిమా విడుదలకు ముందే అక్కడ బద్దలు అవుతున్న రికార్డులు చూసి తెల్లోళ్ళు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 26, 2024 | 12:13 PMLast Updated on: Sep 26, 2024 | 12:15 PM

Record Bookings For Devara Movie

ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తే ఏముందిరా…? హాలీవుడ్ లో షేక్ చేస్తేనే మన దమ్ము ఏంటో తెలుస్తుంది. ఇది పక్కాగా ఫాలో అవుతున్నాడు దేవర. దీనెమ్మ సినిమా విడుదలకు ముందే అక్కడ బద్దలు అవుతున్న రికార్డులు చూసి తెల్లోళ్ళు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. గతంలో చాలా ఇండియా సినిమాలు చూసారు గాని ఈ రేంజ్ లో బజ్ క్రియేట్ అయిన సినిమాను చూడలేదు. సినిమా రిలీజ్ అంటే ఈ రేంజ్ లో ఉండాలిరా అని చూపిస్తూ దేవర జాతర కొనసాగుతోంది. ప్రీ బుకింగ్ మొదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ నెత్తిన కూర్చున్నాడు దేవర.

ఒక్కో రోజు దగ్గర పడుతున్న కొద్దీ ఊపు పెరుగుతుందే గాని తగ్గిన దాఖలాలు అయితే ఇప్పటి వరకు ఎక్కడా కనపడలేదు. ఒక్క అమెరికాలోనే కాదు ప్రపంచంలో సినిమా రిలీజ్ అయిన ప్రతీ దేశంలో ఇలాగే ఉంది దేవర క్రేజ్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ సత్తా చూసిన జనాలు… అసలు సినిమా హిట్ టాక్ వస్తే ఎలా ఉంటది రా అంటూ షాక్ అవుతున్నారు. మన టాలీవుడ్, బాలీవుడ్ హీరోలు ఎవరికి ఈ రేంజ్ లో అమెరికాలో ప్రీ రిలీజ్ మార్కెట్ జరగలేదు అంటే నమ్మండి. ఒక్కో రికార్డ్ ను సముద్రంలో కలిపేస్తున్నాడు దేవర. అమెరికా లెక్కలు ఒక్కసారి చూస్తే…

అందరూ అనుకున్నట్టుగానే దేవర ప్రీ బుకింగ్ మార్కెట్ 2 మిలియన్లు క్రాస్ చేసి సంచలనం సృష్టించింది. ఇప్పుడు 3 మిలియన్ల దిశగా సినిమా వెళ్తోంది. ఇప్పటి వరకు 82 వేల టికెట్ లు బుక్ అయ్యాయి. మొత్తం 2.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది దేవర. మొత్తం షోస్ 2 వేల 488 షోస్ కాగా 839 లోకేషన్స్ లో సినిమా విడుదల అవుతోంది అమెరికాలో. కెనడాలో 60 షోస్ కి 16 లోకేషన్స్ లో లక్షా 52 వేల డాలర్లు వసూలు చేసింది దేవర. ఇంకా విడుదలకు ఒక రోజు సమయం ఉంది. ఈ ఒక్క రోజులో ఎన్ని రికార్డులు బద్దలు అవుతాయో చూడాలి. మొత్తం ప్రీ సేల్స్ 2.9 మిలియన్లుగా ఉంది.