దేవరలో ఎర్ర సముద్రం.. డ్రాగన్‌లో నల్ల సముద్రం.. నీల్ మామ మాస్ ప్లానింగ్..!
ఎర్ర సముద్రం.. ఈ పేరు తెలుసు కదా..? అయినా దేవర సినిమా చూసాక ఈ పేరు మర్చిపోవడం అంత ఈజీ కాదులెండీ. ఎందుకంటే ఆ సినిమాతో ఎర్ర సముద్రాన్ని అంత ఫేమస్ చేసాడు తారక్.

ఎర్ర సముద్రం.. ఈ పేరు తెలుసు కదా..? అయినా దేవర సినిమా చూసాక ఈ పేరు మర్చిపోవడం అంత ఈజీ కాదులెండీ. ఎందుకంటే ఆ సినిమాతో ఎర్ర సముద్రాన్ని అంత ఫేమస్ చేసాడు తారక్. మరి నల్ల సముద్రం సంగతేంటి..? ఈ పేరు ఎప్పుడైనా విన్నారా..? దేవరలో ఉంది కాబట్టి ఎర్ర సముద్రం గురించి ఐడియా ఉంది.. ఆ మధ్య మంగళవారం దర్శకుడు అజయ్ భూపతి సినిమా చేసాడు కాబట్టి మహా సముద్రం కూడా మనకు తెలుసు.. మరి ఈ నల్ల సముద్రం ఏంటబ్బా అనుకుంటున్నారు కదా..? అన్నీ వర్కవుట్ అయితే ఇకపై నల్ల సముద్రం అనే మాట చాలాసార్లు వింటారు.. వినాల్సి వస్తుంది.. వినేలా చేస్తాడు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం వార్ 2తో బిజీగా ఉన్నాడు తారక్. ఈ సినిమా షూటింగ్ ఇంకా కొన్ని రోజులు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఇది పూర్తైన వెంటనే నీల్ మామా సినిమాకు వచ్చేస్తాడు జూనియర్. ఆ లోపే చేయాల్సిన పనులన్నీ పూర్తి చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. తారక్ కోసం అంతా సిద్ధం చేస్తున్నాడు. అయినా నల్ల సముద్రం గురించి చెప్తామని చెప్పి.. ఇప్పుడేమో ఎన్టీఆర్, వార్ 2 అంటూ ఏదేదో చెప్తున్నారు అనుకుంటున్నారా..?
ఇక్కడే ఉంది అసలు కథ. ఈ మధ్య ఎన్టీఆర్‌కు సముద్రం బాగా కలిసొస్తుంది. దేవరలో ఎర్ర సముద్రం పాపులర్ అయింది.. ఇందులో సముద్రాన్ని క్రియేట్ చేయడం కోసం హాలీవుడ్ టీం పని చేసారు. దేవర కథ అంతా సముద్రం చుట్టూనే తిరుగుతుంది. పైగా సినిమాలో దేవర కూడా సముద్రంలోనే ఉంటాడు. ఇక త్వరలోనే చేయబోయే ప్రశాంత్ నీల్ సినిమాలోనూ సముద్రం కీలక పాత్ర పోషించనుంది. ఈ సినిమాలో మేజర్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్ నల్ల సముద్రం దగ్గర షూట్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఇది బల్గేరియా, జార్జియా, రష్యా లాంటి దేశాలు సరిహద్దులుగా ఈ బ్లాక్ సీ ఉంది. ప్రశాంత్ నీల్ సినిమా అంటే ఆడియన్స్‌కు ఓ క్లారిటీ ఉంది. సినిమా ఎంత ఎమోషనల్‌గా ఉన్నా.. ఎంత పెద్ద యాక్షన్ సీక్వెన్స్ నడుస్తున్నా.. స్క్రీన్ మాత్రం నల్లగా మసి పూసినట్లుంటుంది. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో నల్ల సముద్రమే చూపించబోతున్నారని ప్రచారం జరుగుతుంది.
అయితే మరీ మసి పూసినట్లుగా కాకుండా ఈసారి సీన్ మార్చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. పేరు నల్ల సముద్రం అయినా.. సినిమా కలర్ ఫుల్‌గా ఉండబోతుందని.. మేకింగ్ స్టైల్ పూర్తిగా మార్చేస్తున్నాడని తెలుస్తుంది. ఎన్టీఆర్ వచ్చిన తర్వాత యూరప్, బల్గేరియా సమీపంలోని బ్లాక్ సీ దగ్గరే డ్రాగన్ ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. కేజియఫ్, సలార్‌కు భిన్నంగా ఎన్టీఆర్ సినిమా కథ ఉండబోతుందని తెలుస్తుంది. యాక్షన్ పార్ట్‌తో పాటు ఎమోషనల్ కంటెంట్ హెవీగా ఉండబోతుందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికైతే సింగిల్ పార్ట్ మూవీగానే దీన్ని ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్.. ఒకవేళ కథ డిమాండ్ చేస్తే మాత్రం రెండు భాగాలుగా ఈ సినిమా రానుందని తెలుస్తుంది. నల్ల సముద్రం సీన్స్ కూడా అద్భుతంగా ఉంటాయనే టాక్ వినిపిస్తుంది. జనవరి 9, 2026న విడుదల కానుంది ఈ చిత్రం. మొత్తానికి ఎర్ర సముద్రం బాగానే కలిసొచ్చింది.. మరి నల్ల సముద్రం పరిస్థితేంటో..?