Pawan Kalyan : పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి పూనకాలు..
పవర్ స్టార్ (Power Star) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కతున్న తాజా మాఫియా బ్యాగ్‌డ్రాఫ్ (Mafia Bag Draft) చిత్రం ఓజీ. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అయిన హీరో చుట్టు జపాన్‌లో కథ సాగుతుందని తెలుస్తుంది. ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ సుజిత్ (Sujith) దర్శకత్వం వహిస్తున్నారు.

Rejoice for Power Star fans..
పవర్ స్టార్ (Power Star) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కతున్న తాజా మాఫియా బ్యాగ్‌డ్రాఫ్ (Mafia Bag Draft) చిత్రం ఓజీ. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అయిన హీరో చుట్టు జపాన్‌లో కథ సాగుతుందని తెలుస్తుంది. ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ సుజిత్ (Sujith) దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత దానయ్య ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో బిజీ ఉన్నందున ప్రస్తుతం మూవీ షూటింగ్ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో అభిమానులు సైతం ఆయన సినిమాల గురించి కాకుండా పొలిటికల్ విషయాలపై దృష్టి పెట్టారు. ఇలాంటి సందర్భంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ పోస్టర్ పోస్ట్ చేశారు.
పవన్ కల్యాణ్ కత్తితో శత్రుమూకలను తెగనరుకుతున్న పోస్టర్‌ను తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేశారు. పవన్ కళ్యాణ్ వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంటు ధరించి ఒక కత్తితో విలన్స్ ను నరికి ఆ రక్తంతో తడిసి ముద్దయినట్లు కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ చూసి అభిమానులు సంబరపడ్డారు. ఇలాంటి స్టఫ్ కదా మనకు కావాల్సింది అంటూ వారు మేకర్స్ కి విజ్ఞప్తి చేస్తున్నారు సెప్టెంబర్ 27న ఓజీ విడుదల అవుతుందని అధికారిక ప్రకటన వెలువడింది. తాజా పోస్టర్ ఫ్యాన్ మేడ్ అని తెలుస్తుంది. కానీ అది చూడడానికి చాలా బాగుంది. పవన్ లుక్ స్టైలిష్‌గా ఉంది. అయితే కొంత మంది జనసేన అభిమానులు ఆ పోస్టర్‌ను రాజకీయ శత్రువులను చీల్చి చెండాడుతున్న జనసేనాని అనే అర్థం వచ్చేలా రీక్రియేట్ చేస్తున్నారు. దానిపై మీమ్స్ కూడా చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇమ్రాన్ హష్మీ, శ్రియ రెడ్డి వంటి వారు ఇతర కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా 2024 లోనే రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జపాన్ బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ కథాంశంతో ఈ సినిమా సిద్ధమవుతుండగా.. ప్రస్తుతం ఎన్నికల సందర్భంగా మూవీ షూటింగ్ కొన్ని రోజులు వాయిదా పడింది.అ యితే ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుదల చేయగా అభిమానులను అలరించగా… సినిమాపై అంచనాలు పెంచింది.